MLC Kavitha: చంద్రబాబు పోరాడుతున్నారు.. మరి రేవంత్ ఏం చేస్తున్నారు.. కవిత ప్రశ్నల వర్షం
ABN , Publish Date - Jul 27 , 2025 | 06:37 PM
పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాలు అమ్ముతుంటే స్థానిక మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు.

వరంగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిర్చి రైతుల కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారని.. కానీ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్లైట్‌మోడ్‌కు వెళ్లిపోయారని విమర్శించారు. ఇవాళ(ఆదివారం జులై 27) వరంగల్‌లో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వరంగల్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని.. కానీ దానిని ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత.
సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రైతులను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేస్తామంటే రుణాలు అధికంగా తెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి కౌలు రైతులను మర్చిపోయారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లబ్థికోసమే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ సార్లు ఢిల్లీకి వెళ్లివచ్చినా ఫలితం లేదని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత.
పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాలు అమ్ముతుంటే స్థానిక మంత్రి ఏం చేస్తున్నారు..? అని నిలదీశారు. మామునూరు ఎయిర్ పోర్ట్‌కు రాణిరుద్రమ ఎయిర్ పోర్ట్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎంపీ సీఎం రమేష్ మాజీ మంత్రి కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వెలుగు చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల అక్రమాలు..
కర్రు కాల్చి వాత పెట్టాలి.. రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News