Home » ABN Andhrajyothy
ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రైవేటు ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయా సెంటర్లపై ఇదివరకే నమోదైన కేసుల వివరాలు సేకరించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు.
అన్నవరం సత్యదేవుని కొండపై వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. దేవస్థానంలో బహిరంగ వేలంలో హెచ్చుపాటదారుడుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. స్వామివారికి అలంకరణ అనంతరం వాడిపోయే పూలను తరలించే కాంట్రాక్టు పనికి ఆలయ అధికారులు బహిరంగ వేలం వేశారు.
గడ్కరీలో వేగం, అంకిత భావం, చిత్తశుద్ది ఆయనకు మాత్రమే సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో రోడ్లకు రూపం ఇస్తే దాన్ని గడ్కరీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు నిఘా వర్గాల అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
గత జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందినా సరైన విధంగా స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో రవాణా లేని ఏజెన్సీ ప్రాంతాలను రోడ్లతో కలుపుతున్నామని.. అక్కడ డోలీ మోతలు లేకుండా చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు.
నాంపల్లి కోర్టు కేసుపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాలని స్పష్టం చేసిందని అన్నారు. తనకు ఈ దేశ న్యాయవ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.
బ్రిటిష్ పాలకులను తరిమికొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని నొక్కిచెప్పారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ అని అభివర్ణించారు. బీజేపీతో సహా అన్ని పార్టీలు అధికారంలో లేకపోతే ఇంటికే పరిమితమని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ద్వారా పట్టుబడిన రూ.11 కోట్లు బ్యాంకులో సిట్ అధికారులు శనివారం డిపాజిట్ చేశారు. ఆ నోట్లను వీడియో తీయాలని, విడిగానే ఉంచాలని ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు పిటీషన్ వేశారు.
బీఆర్ఎస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. గులాబీ నేతలు పబ్లిసిటీ కోసం మాత్రమే తమ ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. బీఆర్ఎస్ గాలి మాటలు తప్ప వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.