Palla Srinivasa Rao: పెట్టుబడులపై వైసీపీ ఫేక్ ప్రచారం.. పల్లా శ్రీనివాసరావు ఫైర్
ABN , Publish Date - Dec 13 , 2025 | 01:06 PM
స్టీల్ ప్లాంట్‌పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న ఘటనలపై విచారణ జరుగుతోందని తెలిపారు.
విశాఖపట్నం, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి): ఏపీకి వచ్చే పెట్టుబడులపై వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో ప్రో యాక్టివ్‌గా ఉందని వ్యాఖ్యానించారు. ఏపీ స్వర్ణాంధ్ర వైపు పయనిస్తోందని పేర్కొన్నారు. ఇవాళ(శనివారం) విశాఖపట్నంలో పల్లా శ్రీనివాసరావు పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు పల్లా శ్రీనివాసరావు.
ఎకనామిక్ రీజన్ డెవలప్‌మెంట్ సమావేశంలో 2032 టార్గెట్లెను పెట్టుకున్నామని వివరించారు. 38 వేల స్క్వేర్ కిలోమీటర్లు అభివృద్ధి చేయాలని తాము అనుకుంటున్నామని తెలిపారు. కేంద్ర సహకారంతో తాము ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు పల్లా శ్రీనివాసరావు.
స్టీల్ ప్లాంట్ ఘటనలపై విచారణ
స్టీల్ ప్లాంట్‌పై పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న ఘటనలపై విచారణ జరుగుతోందని తెలిపారు. కొంతమంది వారి మనుగడ కోసం ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారేమోనని అనుమానంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ ఘటనలపై విచారణ చేయాలని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను కోరారని అన్నారు. కార్మికుల పక్షానా యాజమాన్యం బాధ్యతగా ఉండి స్టీల్ ప్లాంట్‌ని ముందుకు తీసుకువెళ్లాలని పల్లా శ్రీనివాసరావు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఫైబర్ నెట్ కేసు కొట్టివేత
శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్
Read Latest AP News And Telugu News