Raghurama: ప్రజా ఫిర్యాదులపై ఈ శాసనసభ కమిటీ మొదటి సమావేశం విశాఖలో ఏర్పాటు చేశామని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నారు. ఆ కమిటీ విధి విధానాలపై ప్రజలు, ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదని చెప్పారు. ఈ కమిటీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియా ముందుకు వచ్చామని రఘురామరాజు తెలిపారు.
పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.
కూటమి ప్రుభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన పాపాలను పోలీసులు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లిలో గతంలో టీడీపీ నేతను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో వైసీపీకి చెందిన ముగురిని పోలీసులు అరెస్టు చేశారు.
మండలంలోని మామిడిపల్లిలో వున్న ఒక ప్రైవేటు రిసార్టులో విశాఖకు చెందిన ఒక రియల్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
గంజాయి రవాణా కేసులో నేరం రుజువుకావడంతో ముగ్గురికి పదేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.రత్నకుమార్ సోమవారం తీర్పు ఇచ్చారు.
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్గా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చోడవరం నియోజకవర్గంలో ప్రధానమైన భీమునిపట్నం- నర్సీపట్నం (బీఎన్) రోడ్డు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజలు అందజేసిన అర్జీలకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు.
విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్గా కోన తాతారావును ప్రభుత్వం నియమించింది.
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) నూతన మేయర్గా టీడీపీకి చెందిన 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.