షుగర్ ఫ్యాక్టరీని తెరవాలి
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:58 AM
గోవాడ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్యాక్టరీ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ, గోవాడ షుగర్స్‌ను ఆదుకుంటామని, ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రజాప్రతినిధులు ఇప్పుడు పత్తా లేకుండా పోవడం శోచనీయమని అన్నారు. వేలాది మంది రైతులు, కార్మికుల జీవితాలు ఆధారపడిన గోవాడ ఫ్యాక్టరీ భవిష్యత్తు గురించి చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు స్పందించకపోవడం సరికాదని అన్నారు.
వచ్చే ఏడాది అయినా క్రషింగ్ చేపట్టాలి
రైతు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్
ఫాక్టరీ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష
చోడవరం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్యాక్టరీ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ, గోవాడ షుగర్స్‌ను ఆదుకుంటామని, ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రజాప్రతినిధులు ఇప్పుడు పత్తా లేకుండా పోవడం శోచనీయమని అన్నారు. వేలాది మంది రైతులు, కార్మికుల జీవితాలు ఆధారపడిన గోవాడ ఫ్యాక్టరీ భవిష్యత్తు గురించి చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు స్పందించకపోవడం సరికాదని అన్నారు. ఫ్యాక్టరీని కాపాడతానని పలుమార్లు ప్రకటించిన ఎంపీ సీఎం రమేశ్ కూడా ఏమీ పట్టనట్టుగా ఉన్నారని ఆరోపించారు. కూటమి నాయకులు ఇప్పటికైనా స్పందించి గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి తక్షణ సాయంగా రూ.100 కోట్లు కేటాయించి, వచ్చే క్రషింగ్ సీజన్నుంచైనా ఫ్యాక్టరీని నడిపించాలని డిమాండ్ చేశారు.
గోవాడ షుగర్స్ కార్మిక సంఘం నాయకుడు శరగడం రామునాయుడు మాట్లాడుతూ, షుగర్ ఫ్యాక్టరీ విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఫ్యాక్టరీలో క్రషింగ్ నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండో ఏడాదిలోనే షుగర్ ఫ్యాక్టరీని మూసివేయడం శోచనీయమన్నారు. చెరకు రైతులకు, ఫ్యాక్టరీ కార్మికులకు రూ.35 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని పూర్తిగా ఓవర్‌హాలింగ్ చేయించి వచ్చే ఏడాది క్రషింగ్‌కు సిద్ధం చేయాలని, లేకపోతే రైతులు, కార్మికులు ఆందోళనను ఉధృతం చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కర్రి అప్పారావు, ఏడువాక సత్యారావు, సేనాపతి సత్యారావు, రాయి సూరిబాబు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు.