Home » LATEST NEWS
Mahesh Goud: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొత్తుని కేసీఆర్ కుటుంబం అన్నిరంగాల్లో దోచుకుందని మహేష్‌కుమార్ గౌడ్ ఆరోపించారు.
Uttar Pradesh News: తనకు ఇష్టమైన పనీర్ కర్రీని ఇంకా కొంచెం ఎక్కువ వేయాలని వడ్డిస్తున్న వారిని అడిగాడు. ఇందుకు వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ధరేంద్ర వారితో గొడవపడ్డాడు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు.
Mumbai Indians: ముంబై ఇండియన్స్ పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. గాయం కారణంగా ఈ సీజన్ ఆరంభంలో కొన్ని మ్యాచులకు దూరమయ్యాడు బుమ్రా. అయితే లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా ప్రత్యర్థి బ్యాటర్లకు పోయిస్తున్నాడు. ఈ తరుణంలో అతడి ఫ్యామిలీ ట్రోలింగ్‌కు గురవడం చర్చనీయాంశంగా మారింది.
Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
గతంలో విచారణ సందర్భంగా అల్హాబాదియా విదేశీ ప్రయాణాలపై నిషేధం విధిస్తూ, పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తన పాస్‌పోర్ట్‌ను రిలీజ్ చేయాలని అల్హాబాదియా సుప్రీంకోర్టుకు తిరిగి అశ్రయించారు.
భారతీయులు తామేంటో చూపిస్తే, విదేశీయులు భారత్ పై ఉన్న నమ్మకాన్ని అణువంత కూడా సడలించుకోలేదు. భారత సర్కారుపై ఉన్న అచంచల విశ్వాసం.. వాళ్ల నడక, నడవడికలో కనిపిస్తున్నాయ్..
Supreme Court: సోషల్ మీడియాతోపాటు ఓటీటీ చానెల్స్‌లో లైంగిక అసభ్యకమైన కంటెంట్ ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో దీనిని నియంత్రించాలంటూ పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ విఫలం అయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
రోజూ ఎంత సేపు ఎక్సర్సైజులు చేయాలనేది చాలా మందికి కలిగే సందేహం. దీన్ని నిర్ధారించేందుకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
జన్మనిచ్చిన కన్నతల్లినే కొడుకు చిత్రహింసలు పెడుతున్న అతి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో రామారావు అనే వ్యక్తి తన తల్లిని మానసికంగా, శరీరకంగా వేదనకు గురిచేస్తున్నాడు.
వెంకన్న దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫిర్యాదుల బాక్స్, ఫీడ్ బ్యాక్ బుక్‌తో పాటు అధునాతన టెక్నాలజీ ద్వారా భక్తుల వద్ద నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ అందుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్, పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఉగ్ర మూక 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకుంది. ఉగ్రవాదులు పర్యాటకుల మతం ఏంటో కనుక్కుని మరీ చంపేశారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ ముస్లిం వ్యక్తిని కూడా కాల్చేశారు.
Rahul Gandhi: భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు’ అంటూ మండిపడ్డారు. ఉగ్రదాడి మృతులకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.
జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. అమాయకులైన పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.
హైదరాబాద్ మెట్రో ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Chandrababu Naidu: పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమేరకు తన సంఘీభావాన్ని తెలిపారు.
అఘోరికి తన ఇంటికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేసిన జోగులాంబ ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద శర్మను అధికారులు సస్సెండ్ చేశారు. పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు ఆనంద శర్మపై వేటు వేశారు.
Liquor Scam: మద్యం స్కామ్‌లో రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని సిట్ తెలియజేసింది. మద్యం కుంభకోణం కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న చాణిక్యను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. ఆయన రిమాండ్ రిపోర్టులో అనేక సంచలన అంశాలు పొందుపర్చారు.
దేశంలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న 10 మంది అనుమానితులను ఆంధ్రప్రదేశ్‌లో నిఘావర్గాలు గుర్తించాయి.
ఈ నెల 27 నుంచి పాకిస్థానీ విసాలు రద్దవుతాయని భారత విదేశీ వ్యవహారాలశాఖ పర్కొంది. 48 గంటల్లో పాకిస్థానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇక మెడికల్ వీసాలు 29న రద్దవుతాయని, డెడ్‌లైన్ కంటే ముందే పాకిస్థానీలు వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ...
ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం వచ్చిందని, ఉగ్రదాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకుంటారని ప్రధాని మోదీ అన్నారు. ఊహకు మించిన ప్రతీకారం ఉంటుందని, ప్రతీకారం ఎలా ఉంటుందో.. ప్రపంచం కూడా చూడబోతోందని అన్నారు.
Pakistan Military Alert: భారతదేశం చర్యలకు ఉపక్రమిస్తే తిప్పికొట్టడానికి పాకిస్థాన్ ఆర్మీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్ సమీపంలోని సరిహద్దు ప్రాంతాలకు పాకిస్థాన్ సైన్యాన్ని మోహరిస్తోంది.
చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోలీసులు ఫోక్సో కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ నిందితుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. చిన్న పిల్లలను టార్గెట్‌గా చేసుకుని వాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.ఈ ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి.
తన భర్తను కాల్చి చంపిన ఉగ్రవాదుల ఎదుట ఆమె రోదిస్తూ తనను కూడా చంపమని వేడుకుంది. అయితే మేము నిన్న చంపమని ఇక్కడ జరిగిన సంఘన పోయి మోదీకి చెప్పు.. అంటూ వాళ్లలో ఒకరు బదులిచ్చారని ఆమె వాపోయింది.
Tirupati Police Drone: పగలు సైలెంట్ అయిన అల్లరిమూకలు రాత్రి సమయాల్లో రెచ్చిపోతున్నారు. వీరి ఆటకట్టించేందుకు తిరుపతి పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో వారిని పట్టుకుంటున్నారు.