Home » AP News
Tenali Railway Station: తెనాలి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
Ganesh Sharma: కంచికామకోటి పీఠ ఉత్తరాధికారిగా నియమితులైన రుగ్వేద పండితోత్తముడు దుడ్డు సత్యవెంకట సూర్యసుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రవిడ్ ద్వారకా తిరుమలలో రుగ్వేదం అభ్యసించారు. వేసవి సెలవుల్లో తిరుపతిలో ఉన్న మేనమాన ఇంటికి వెళ్లిన గణేష్ శర్మను అదే సమయంలో తిరుపతి వచ్చిన కంచి కామ కోటి పీఠం శంకరాచార్య స్వామీజీ దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు.
Venkatavinay: వేంపల్లె శ్రీరామ్నగర్కు చెందిన శ్రీనివాసులు, గంగాదేవి కుమారుడు వలసగారి వెంకటవినయ్. అక్కడి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదు వుతున్నాడు. చదువుతో పాటు ఆటల్లో కూడా చురుగ్గా రాణిస్తున్నాడు. ప్రధానంగా చెస్లో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులతో పోటీపడి గెలవగలిగే సత్తా తెచ్చుకున్నాడు.
వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) కోసం రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు దేవస్థానం ఈవో కొమ్ముల సుబ్బారావు తెలిపారు.
Raghurama: ప్రజా ఫిర్యాదులపై ఈ శాసనసభ కమిటీ మొదటి సమావేశం విశాఖలో ఏర్పాటు చేశామని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నారు. ఆ కమిటీ విధి విధానాలపై ప్రజలు, ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదని చెప్పారు. ఈ కమిటీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియా ముందుకు వచ్చామని రఘురామరాజు తెలిపారు.
ఉగ్రవాదులను ఎదుర్కొవడమంటే ధైర్యంతో కూడుకున్న పని అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పహల్గాం దాడిలో చాలా దారుణంగా పర్యాటకులను చంపేశారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరు మోసగాళ్లు బరితెగించారు. కొందరు ఆన్లైన్ ఫేస్బుక్, వాట్సప్ తదితర రూపాల్లో సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని మరింత సన్నిహిత్యం పెంచుకోవడం. తరచూ ఫోన్లో సంభాషించడం జరుగుతోంది.
Minister Narayana: మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు.
Land Mafia: నెల్లూరు జిల్లాలోని వింజమూరులో ఉన్న సర్కార్ భూములపై భూమాఫియా సరికొత్త కుట్రలకు తెరదీసింది. గత యాభై ఏళ్లుగా ఈ భూములు భూ మాఫియా చేతిలో చిక్కుకున్నాయి. అయితే ఈ భూముల విలువ వందకోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వం భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 24 గంటల నిఘా కోసం భారత్ ఈవోఎస్-09 గూఢచారి ఉపగ్రహాన్ని జూన్లో ప్రయోగించబోతోంది. శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది.