Share News

BREAKING: కిడ్నాప్ కలకలం.. చితకబాదిన గ్రామస్తులు..

ABN , First Publish Date - Dec 13 , 2025 | 08:39 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: కిడ్నాప్ కలకలం.. చితకబాదిన  గ్రామస్తులు..

Live News & Update

  • Dec 13, 2025 21:17 IST

    కిడ్నాప్ కలకలం.. చితకబాదిన గ్రామస్తులు..

    • నిజామాబాద్: ఆలూరు మండల కేంద్రంలో కిడ్నాప్ కలకలం..

    • చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న కిడ్నాపర్..

    • నలుగురు పిల్లల్ని తీసుకొని ఆటోలో కిడ్నాప్ చేస్తుండగా పట్టుకున్న గ్రామస్తులు...

    • కేకలు వేస్తూ ఆటో నుంచి దూకిన ఇద్దరు పిల్లలు..

    • కిడ్నాపర్‌ను పట్టుకుని చితకబాదిన గ్రామస్తులు..

    • కిడ్నాప్ చేస్తూ తీసుకెళ్తున్న ఆటోలో ధ్వంసం చేస్తున్న స్థానికులు...

    • కిడ్నాప్ గురైన విద్యార్థులు శృతిహాసన్,,సహస్ , చిన్న సహస్ మనోజ్...

    • సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్మూర్ SHO నారాయణ గౌడ్.

  • Dec 13, 2025 20:45 IST

    రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..

    • మెదక్ జిల్లా: పెద్ద శంకరంపేట మండల కేంద్రం శివారులో 161 జాతీయ రహదారిపై కింగ్స్ 9 దాబా వద్ద రోడ్డు ప్రమాదం..

    • బైక్‌ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం...

    • బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి..

    • మృతులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన వారు..

    • మృతుల వివరాలు.. భర్త కుర్మ లింగమయ్య (45), అతని భార్య సాయవ్వ (40), కొడుకు సాయిలు (18), కూతురు మానస (8)..

    • ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.

  • Dec 13, 2025 20:44 IST

    ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కేపీ రావుపై కేసు నమోదు

    • ఇండియా కబడ్డీ జట్టుకు ఎంపిక చేయకుండా అడ్డుకున్నారని..

    • ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌, డీజీపీకి ప్లేయర్‌ గౌరి ఫిర్యాదు

  • Dec 13, 2025 19:55 IST

    ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు..

    • తిరుపతి: వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని శ్రీ అభయ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో బాంబు స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు..

    • తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) అనుబంధ ఆలయం కావడంతో భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు..

    • ఇటీవల తిరుపతిలో వచ్చిన బాంబు బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తత..

    • శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భద్రతా చర్యలు కట్టుదిట్టం..

    • జిల్లా ఎస్పీ, విజిలెన్స్ అధికారుల ఆదేశాలతో తనిఖీలు..

    • బాంబ్ స్క్వాడ్ ద్వారా ఆలయ ప్రాంగణం, పరిసరాల పరిశీలన..

    • తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు వెల్లడి..

    • భక్తులు ఆందోళన చెందవద్దని, భద్రత పూర్తి స్థాయిలో ఉందని అధికారులు భరోసా.

  • Dec 13, 2025 19:32 IST

    రోగి వేలు కొరికిన ఎలుక..

    • వరంగల్ : ఎంజీఎంలో రోగులకు తప్పని ఎలుకల బాధ..

    • హర్షం భరత్ కుమార్ అనే రోగి వేలు కొరికిన ఎలుక..

    • ఆర్థోపెడిక్ సమస్యతో ఎంజీఎంలో చేరిన నల్లబెల్లి మండలం నందిగామకు చెందిన భరత్ కుమార్.

  • Dec 13, 2025 19:19 IST

    కడపకు చేరుకున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర

    • కడప: కడపకు చేరుకున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ..

    • వాజ్‌ పేయి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో సాగుతున్న యాత్ర..

    • కడపలో మాధవ్ బృందానికి ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు..

    • కడప నగర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ శ్రేణులు..

    • వాజ్‌ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన కూటమి పార్టీల నేతలు.

  • Dec 13, 2025 19:11 IST

    రాత్రి రాహుల్‌తో కలిసి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్

    • ఓట్‌ చోరీపై రేపు రామ్‌లీలా మైదానంలో మహాధర్నా..

      • ధర్నాలో పాల్గొననున్న రేవంత్‌, కాంగ్రెస్‌ ముఖ్యనేతలు.

  • Dec 13, 2025 19:07 IST

    21 న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్స్ పోలియో

    • ఈనెల 21న.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్స్ పోలియో..

    • 54 ల‌క్ష‌ల మందికి పైగా పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌లు వేసేందుకు ఏర్పాట్లు..

    • వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్.

  • Dec 13, 2025 17:57 IST

    9 మంది విద్యార్థులకు అస్వస్థత..

    • కడప: తొండూరు మండలం యాద వారిపల్లె ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో ఫుడ్ పాయిజన్..

    • 9 మంది విద్యార్థులకు అస్వస్థత..

    • చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలింపు.

  • Dec 13, 2025 17:49 IST

    కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి మంత్రి ఉత్తమ్‌ లేఖ

    • పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ..

    • తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని ఉత్తమ్‌ వినతి.

  • Dec 13, 2025 16:52 IST

    రెవెన్యూ సంస్కరణల పేరిట జగన్ భూ కుంభకోణం..

    • 22A జాబితాలో రైతుల భూములను చేర్చి ఇబ్బందులకు గురి చేశారు..

    • భూ దోపిడీకి చెక్ పెట్టిన కూటమి ప్రభుత్వం..

    • ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేసి ప్రజల భూములకు రక్షణ కల్పించాం..

    • రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం: మంత్రి అనగాని సత్యప్రసాద్

  • Dec 13, 2025 10:08 IST

    తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

    • ఏపీలోని ఏజెన్సీల్లో దట్టంగా పొగమంచు

    • మరో 3 రోజులపాటు చలి తీవ్రత

    • పటాన్‌చెరులో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

    • ఆదిలాబాద్‌, మెదక్‌లో 7 డిగ్రీలు

    • రాజేంద్రనగర్‌లో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత

    • హనుమకొండలో 8.5, రామగుండంలో 10 డిగ్రీలు

  • Dec 13, 2025 09:49 IST

    ఆకాంక్షిత జిల్లాల జాబితాలో దేశంలోనే అగ్రస్థానం కడప

    • వినూత్న పథకాలు, ఇతర కార్యక్రమాల అమల్లో జాతీయస్థాయిలో..

    • అగ్రస్థానం సాధించిన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్

    • ఢిల్లీలో కడప కలెక్టర్ శ్రీధర్‌ను అవార్డుతో అభినందించిన నీతిఅయోగ్

    • కడప జిల్లా అభివృద్ధికి మరో7.50 కోట్లు మంజూరుకు నీతిఅయోగ్ ఆమోదం

  • Dec 13, 2025 08:43 IST

    నేడు భారత పర్యటనకు అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీ

    • GOAT టూర్‌లో భాగంగా 3 రోజులు భారత్‌లో మెస్సీ టూర్‌

    • 14 ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న మెస్సీ

    • హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో మెస్సీ పర్యటన

    • ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులను కలవనున్న మెస్సీ

  • Dec 13, 2025 08:42 IST

    ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్ల సరఫరాకు నిధులు మంజూరు

    • రూ.830.04 కోట్ల నిధులు విడుదలకు ప్రభుత్వం అనుమతి

    • 1 నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు కిట్లు పంపిణీ

    • సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట రాష్ట్ర ప్రభుత్వం కిట్లు పంపిణీ

    • 2026-27 విద్యాసంవత్సరంలో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసేందుకు నిధులు విడుదల

    • నోట్ బుక్ లు, బెల్డ్ ,షూలు, బ్యాగ్ , పిక్టోరియల్ డిక్షనరీ ,ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఇవ్వనున్న ప్రభుత్వం

    • పాఠ్య పుస్తకాలు , వర్క్ బుక్ లు, 3 జతల యూనిఫాం క్లాత్ లతో కూడిన కిట్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం

    • కిట్ల సేకరణ పంపిణీ కోసం రూ.157.20 కోట్లు నిధులు ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం

    • టెండర్ల ప్రక్రియ ద్వారా కిట్ల సరఫరా , పంపిణీ దారులను నిర్ణయించాలని ఆదేశాలు

    • ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్

  • Dec 13, 2025 08:40 IST

    2027 గోదావరి పుష్కరాల తేదీలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

    • 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు

    • 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు కొనసాగనున్నట్లు తెలిపిన ప్రభుత్వం

    • తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ గారి అభిప్రాయం మేరకు తేదీలు ప్రకటన

    • విజయవాడలోని ఎండోమెంట్స్ కమిషనర్ నుంచి అందిన ప్రతిపాదనలను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం

    • ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన దేవాదాయ శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం. హరి జవహర్ లాల్

  • Dec 13, 2025 08:40 IST

    రేపు రెండోవిడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్

    • నేడు పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి తరలింపు

    • రెండో విడతలో 3,911 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు

    • రెండో విడతలో 415 సర్పంచ్‌ స్థానాలు, 8,304 వార్డులు ఏకగ్రీవం

  • Dec 13, 2025 08:39 IST

    నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

    • రేపు ఓట్ చోరీపై మహాధర్నాలో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి

  • Dec 13, 2025 08:39 IST

    నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ

    • మెస్సీ, రేవంత్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ వీక్షించనున్న రాహుల్‌