Share News

Veligallu Project: వెలిగల్లు ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగు

ABN , Publish Date - Dec 13 , 2025 | 08:11 AM

వెలిగల్లు ప్రాజెక్టు పూర్తయి సుమారు 16 సంవత్సరాలు అవుతోం ది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా నిర్దేశిత ఆ యకట్టుకు నీళ్లు అందడం లేదు. పిచ్చిమొక్క లు, మట్టి, రాళ్లతో కాలువలు పూడిపోవడం.. లైనింగ్‌ లేకపోవడంతో.. కాలువలకు వదిలిన నీళ్లలో ఎక్కువగా ఇంకిపోవడం.. బయటకు వెళ్లిపోతున్నాయి.

Veligallu Project: వెలిగల్లు ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగు
Veligallu Project

‘వెలిగల్లు’ మరమ్మతులకు రూ.36 కోట్లు

అధికారుల ప్రతిపాదనలు

పూర్తైతే.. చివరి ఆయకట్టుకూ నీళ్లు

(రాయచోటి-ఆంధ్రజ్యోతి): వెలిగల్లు ప్రాజెక్టు (Veligallu Project) పూర్తయి సుమారు 16 సంవత్సరాలు అవుతోం ది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా నిర్దేశిత ఆ యకట్టుకు నీళ్లు అందడం లేదు. పిచ్చిమొక్క లు, మట్టి, రాళ్లతో కాలువలు పూడిపోవడం.. లైనింగ్‌ లేకపోవడంతో.. కాలువలకు వదిలిన నీళ్లలో ఎక్కువగా ఇంకిపోవడం.. బయటకు వెళ్లిపోతున్నాయి. తద్వారా వెలిగల్లు కుడికాలు వకు ఆయకట్టు నీళ్లు అందడం లేదు. ఎప్పుడో ఐదారేళ్లకు ఒకసారి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతున్నా.. రైతులకు ఉపయోగం ఉండడం లేదు. దీంతో కుడికాలువ ఆయకట్టు చివరి వ రకు నీళ్లించేందుకు.. కాలువ మరమతుల కో సం రూ.36 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కుడికాలువ రైతుల సమస్య తీరినట్టే.


ఒక్కసారీ చివరి ఆయకట్టుకు చేరని నీళ్లు

రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల పరిధిలో పాపాఘ్ని నదిపైన వెలిగల్లు వద్ద వెలిగల్లు ప్రాజెక్టును నిర్మించారు. ఎడమ కాలువ కింద 500 ఎకరాలు, కుడి కాలువ కింద 21,400 ఎకరాలు ఆయకట్టుగా నిర్ణయించి ఈ ప్రాజెక్టును సుమారు రూ.200 కోట్లతో నిర్మిం చారు. 2009 ఎన్నికలకు ముందు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కాలువల నిర్మాణానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ కంపెనీ సుమారు రూ.9కోట్లకు టెండర్లు దక్కించుకుం ది. అయితే ఈ కాలువలకు అనుబంధంగా పిల్ల కాలువలు పూర్తి చేయకుండానే.. మొత్తం బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తా యి. ప్రధాన కాలువకు పలుచోట్ల గండ్లు పడడం.. పిచ్చిమొక్కలు, రాళ్లతో కాలువలు పూడిపోవడం, పిల్ల కాలువలు లేకపోవడంతో.. ప్రాజెక్టు పూర్తయి.. 16 ఏళ్లయినా.. ఇప్పటి వరకు చివరి ఆయకట్టుకు నీళ్లు అందింది లేదు. ఈ పదహారేళ్లలో మూడు పర్యాయాలు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. దీంతో ప్రాజెక్టులో నీళ్లున్నా.. రైతుల పొలాలకు అందలేదనే అసంతృప్తి వెలిగల్లు ప్రాజెక్టు కుడికాలువ ఆయకట్టుదారుల్లో ఉంది.


వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యమే?

2019 నుంచి 2024 వరకు ఉన్న వైసీపీ ప్రభు త్వ హయాంలోనూ.. వెలిగల్లు ప్రాజెక్టు విష యంలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారనే వి మర్శలు ఉన్నాయి. కుడికాలువ కింద గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో కలిపి 56 కి.మీ. మేర 15 పల్లెల్లో 21,400 ఎకరాల ఆ యకట్టు ఉంది. అయితే ఇందులో చాలా వరకు కాలువ దెబ్బతింది. కాలువలో భారీగా జమ్ము, కంపలు మొలిచాయి. పెద్దపెద్ద బండరాళ్లు, మ ట్టిదిబ్బలు ఉన్నాయి. కాలువకు నీళ్లు వదిలిన ప్పుడు పలుచోట్ల కాలువకు గండ్లు పడుతున్నా యి. దీంతో 21,400 ఎకరాలకు గానూ.. కనీసం మూడు నాలుగు వేల ఎకరాలకు కూడా వెలిగ ల్లు కుడి కాలువ ద్వారా నీళ్లు అందడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ కాలు వల మరమ్మతుల కోసం రూ. 15 కోట్లు కేటా యించారు. కాంట్రాక్టర్‌ పనులు చేశారు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో.. రూ.3.5 కోట్లకు బిల్లులు చేసుకుని కాంట్ర్టార్‌ పనులు మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు.


రూ.36 కోట్లతో ప్రతిపాదనలు

వెలిగల్లు కుడికాలువ ద్వారా.. గతంలో 30 చెరువులకు నీళ్లు నింపేవాళ్లు. అయితే ఈసారి సుమారు 60 చెరువులు నీళ్లతో నింపారు. కుడి కాలువ ద్వారా 21,400 ఎకరాలు ఆయకట్టు అని అనధికారికంగా చెప్తున్నారే కానీ.. అధికారి కంగా నిర్ణయించలేదు. అయితే ఈ కాలువ ద్వారా కేవలం నాలుగు వేల ఎకరాల్లోపే ఆయ కట్టుకు నీళ్లు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కుడికాలువ మరమ్మతులకు రూ. 36 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపిం చారు. ఈ నిధులతో కాలువకు లైనింగ్‌ చేయ డం. బెడ్‌కాంక్రీట్‌ వేయడం, గండ్లు పడే అవకా శం ఉన్నచోట ముందస్తుగా కాంక్రీట్‌ గోడలు నిర్మించడం వంటి పనులు చేపట్టనున్నారు. ఈ కాలువ మరమ్మతులే పూర్తి అయితే.. ఇప్పటి వరకు అనధికారికంగా అనుకుంటున్న 21,400 ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఫైబర్ నెట్ కేసు కొట్టివేత

అల్లూరి జిల్లా బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 13 , 2025 | 08:11 AM