Home » Andhra Pradesh » Kadapa
ఆకాంక్షిత జిల్లాల్లో దేశంలోనే ప్రథమ స్థానం సాధించింది కడప జిల్లా. వినూత్న పథకాలు, ఇతర అభివృద్ధి పథకాలు వ్యూహాత్మక ప్రణాళిక చేసి జాతీయస్థాయిలో మొదటి స్థానం సాధించారు కలెక్టర్ చెరుకూర శ్రీధర్.
వెలిగల్లు ప్రాజెక్టు పూర్తయి సుమారు 16 సంవత్సరాలు అవుతోం ది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా నిర్దేశిత ఆ యకట్టుకు నీళ్లు అందడం లేదు. పిచ్చిమొక్క లు, మట్టి, రాళ్లతో కాలువలు పూడిపోవడం.. లైనింగ్ లేకపోవడంతో.. కాలువలకు వదిలిన నీళ్లలో ఎక్కువగా ఇంకిపోవడం.. బయటకు వెళ్లిపోతున్నాయి.
కొంతకాలంగా అరటి ధరలు పాతాళానికి పడిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతూ వచ్చారు. అయితే నాలుగైదు రోజులుగా అరటి ధరలు పెరుగుతున్నాయి.
కడప కొత్త మేయర్ పాకా సురేష్‌కు వ్యతిరేకంగా నగరంలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మన కడపకు ఇదేం కర్మ.. సిగ్గు సిగ్గు అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక గురువారం జరిగింది. ఈ ఎన్నికల్లో కడప మేయర్‌గా పాక సురేశ్ ఎన్నికయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. మేయర్ అభ్యర్థిగా పాక సురేశ్ అభ్యర్థిత్వాన్ని వైసీపీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, షఫీలు బలపరిచారు.
కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి విషయంలో ప్రోటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యంపై ప్రివిలేజ్ కమిటీ సమావేశమై చర్చించింది. అప్పటి మెడికల్ సూపరింటెండెంట్, డీఆర్వోను కమిటీ ప్రశ్నించింది.
మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందులలో పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకారెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని వివేకా కుమార్తై సిబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.
వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు సొంత నియోజకవర్గ ప్రజలు మరో షాకిచ్చారు. తాజాగా ఇవాళ రెండు వందల మైనారిటీ కుటుంబాలు వైసీపీకి తిలోదకాలిచ్చి టీడీపీ కండువా కప్పుకున్నారు.
అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. రత్నమ్మ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.