Viveka Case: వివేకా హత్య కేసు.. కోర్టు ఏం చెప్పబోతోంది.. కొనసాగుతున్న హైటెన్షన్..?
ABN , Publish Date - Dec 03 , 2025 | 05:42 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకారెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని వివేకా కుమార్తై సిబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.
కడప, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (Vivekananda Reddy Case) సమగ్ర దర్యాప్తు జరపాలని సీబీఐ కోర్టులో (CBI Court) ఆయన కూతురు సునీతారెడ్డి (Sunitha Reddy) పిటిషన్ దాఖలు చేశారు. సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(బుధవారం) న్యాయస్థానం విచారణ చేసింది. ఈ క్రమంలో సునీత వేసిన పిటిషన్‌పై వాదనలు పూర్తి అవడంతో తీర్పును రిజర్వ్ చేసింది సీబీఐ కోర్టు. ఈ నెల 10వ తేదీన తీర్పు వెల్లడించనుంది సీబీఐ కోర్టు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరిపించేలా సీబీఐకు న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలంటూ సునీత న్యాయవాదులు వాదనలు వినిపించారు.
తన తండ్రి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపకపోతే అసలైన వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు సునీత. ఇదే కేసులో సప్లమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సునీత తరుపు న్యాయవాది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపితే ఇప్పటివరకు వెలుగు చూడని సంచలన విషయాలు బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు సునీతారెడ్డి.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్
శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం..
Read Latest AP News and National News