Share News

CM Ramesh Mother: అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు మాతృవియోగం

ABN , Publish Date - Nov 26 , 2025 | 07:37 AM

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ తల్లి చింతకుంట రత్నమ్మ కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. రత్నమ్మ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

CM Ramesh Mother: అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు మాతృవియోగం
CM Ramesh Mother Ratnamma Passes Away

హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ (CM Ramesh) తల్లి చింతకుంట రత్నమ్మ (83) కన్నుమూశారు. ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున 3:39 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా రత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం వారి స్వగ్రామం పోట్లదుర్తికి తీసుకెళ్లారు. పోట్లదుర్తిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. రత్నమ్మ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.


రత్నమ్మ భర్త చింతకుంట మునుస్వామి నాయుడు. ఆమెకు ఆరుగురు సంతానం. వారిలో.. కుమారులు సీఎం సురేశ్‌, సీఎం రమేశ్‌, సీఎం ప్రకాశ్, సీఎం రాజు.. కుమార్తెలు గుమ్మళ్ల మాధవి, పాటూరు విజయలక్ష్మి ఉన్నారు. ఆమె అంతిమ సంస్కారాలు రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం, పోట్లదుర్తి గ్రామంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. రత్నమ్మ మృతి వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సీఎం రమేశ్‌కు ఫొన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..

ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2025 | 08:00 AM