Share News

Pemmasani Chandrasekhar: రైతుల ఇష్యూపై కేంద్రమంత్రి పెమ్మసాని క్లారిటీ

ABN , Publish Date - Dec 13 , 2025 | 10:52 AM

అమరావతి రైతులతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల సమావేశం అయ్యారు. ఈ మీటింగులో జరిగిన చిన్న ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. . అన్నదాతలతో సమావేశం ప్రారంభించే ముందు కొన్ని సూచనలు చేశానని ప్రస్తావించారు.

Pemmasani Chandrasekhar: రైతుల ఇష్యూపై  కేంద్రమంత్రి పెమ్మసాని క్లారిటీ
Union Minister Pemmasani Chandrasekhar

అమరావతి, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి): అమరావతి రైతులతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Pemmasani Chandrasekhar) ఇటీవల సమావేశం అయ్యారు. ఈ మీటింగులో జరిగిన చిన్న ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఇష్యూ జరగడానికి గల కారణాలపై ఇవాళ(శనివారం) మీడియాతో మాట్లాడారు పెమ్మసాని. అన్నదాతలతో సమావేశం ప్రారంభించే ముందు కొన్నిసూచనలు చేశానని ప్రస్తావించారు పెమ్మసాని చంద్రశేఖర్.


సీరియస్ విషయంపై చర్చ జరుగుతోందని.. ప్రశాంతంగా ఉండాలని.. ఎవరూ అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దని తాను మూడుసార్లు చెప్పానని గుర్తుచేశారు. సీరియస్ ఇష్యూ జరుగుతుంటే.. యూట్యూబ్ వీడియోలు, ఫోన్‌లో మాట్లాడవద్దని తాను సూచించానని తెలిపారు. కానీ కొంతమంది చెప్పినా పట్టించుకోకపోవడంతో తాను ఇలా చేయొద్దని వారించానని పేర్కొన్నారు. అయినా కొంతమంది యూట్యూబ్ వీడియోలు చూశారని.. వేలమంది రైతులకు సంబంధించిన విషయం చర్చిస్తుంటే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు పెమ్మసాని చంద్రశేఖర్.


దేనికైనా ఓ పద్ధతి ఉంటుందని.. ఇష్టం వచ్చినట్లుగా చేస్తే ఎలా అని అడిగారు. రైతన్నలతో జరిగిన ఈ సమావేశంలో ఇంకో వ్యక్తి నాలుగుసార్లు మాట్లాడారని.... ప్రతిసారి ఆయనే మాట్లాడతానంటే ఎలా.. మిగతా వారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. ఏదైనా సీరియస్ ఇష్యూ జరుగుతుంటే రూల్స్ పాటించాలని సూచించారు. ఎవరైనా కొన్ని రూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. చిన్న, సన్నకారు రైతులు శని ఆదివారాల్లో తన కార్యాలయానికి ఎప్పుడైనా రావచ్చని తెలిపారు. అన్నదాతల సమస్యలు తనకు నేరుగా చెప్పవచ్చని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఫైబర్ నెట్ కేసు కొట్టివేత

శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 13 , 2025 | 11:11 AM