Home » Pemmasani Chandrasekhar
తమ ప్రభుత్వంలో సూపర్ సిక్స్‌తో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, పథకాలకు యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. గత జగన్ ప్రభుత్వంలో రూ.1000లు పింఛన్ పెంచడానికే ఐదేళ్లు పట్టిందని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు.
గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాఘవేంద్రప్రసాద్, కల్యాణి దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.4 కోట్లు విరాళం ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. దాతల విరాళంలోని రూ.40 లక్షలతో బీసీల కమ్యూనిటీ భవన నిర్మానానికి శంకుస్థాపన చేశామని తెలిపారు.
వైసీపీ హయాంలో గాడితప్పిన పాలనను కూటమి ప్రభుత్వం దారిలో పెడుతుంటే...
గుంటూరు జిల్లాలో యోగా, సహజ చికిత్స పరిశోధనా సంస్థతోపాటు వంద పడకల ఆస్పత్రి, సిబ్బంది నివాస సముదాయానికి కేంద్రం 94కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
సొంత పార్టీ ఎంపీలనే ఏకవచనంతో సంబోధిస్తూ అవమానించే కు సంస్కృతి జగన్‌ది’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. గుంటూరులో శనివారం జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్...
దేశంలోని గ్రామీణ ప్రాంతాలు సాధికారత సాధించినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
భారతదేశం డిజిటల్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా మారింది అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బ్రెజిల్‌లో జరిగిన 11వ బ్రిక్స్ కమ్యూనికేషన్స్ మంత్రుల సమావేశంలో భారత్ 4జీ, 5జీ సేవల విస్తరణ వివరించారు.
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గండికోటను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు 78 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు తెలిపారు. గండికోట ప్రాంతాన్ని గ్రాండ్ కాన్యన్ స్థాయిలో అభివృద్ధి చేయాలని, శ్రీకృష్ణదేవరాయల వంద అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
అమరావతిలో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్) ఏర్పాటు చేయాలని ఏపీ పరిశ్రమల సమాఖ్య కేంద్ర ప్రభుత్వానికి వినతి చేసింది. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి పథకాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, మరియు పరిశ్రమల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కూడా సూచించారు.
భూమికి స్పష్టమైన హక్కుల కోసం రికార్డుల డిజిటలైజేషన్ అత్యవసరం అని కేంద్ర మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. రాష్ట్రాల రాజకీయం వల్ల ఇది ఆలస్యం అవుతోందని వ్యాఖ్యానించారు.