Share News

Pemmasani Chandrashekhar: కూటమి ప్రభుత్వంలోనే ఉద్యోగ కల్పన, రాష్ట్రానికి ఆదాయం..

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:11 AM

ఏపీలో డేటా సెంటర్ కోసం గత సంవత్సరకాలం నుంచి మంత్రి నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని పెమ్మసాని గుర్తు చేశారు. రూ.90,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్‌ను కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు.

Pemmasani Chandrashekhar: కూటమి ప్రభుత్వంలోనే ఉద్యోగ కల్పన, రాష్ట్రానికి ఆదాయం..
Pemmasani Chandrashekhar

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగ కల్పన, రాష్ట్రానికి ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. గూగుల్ లాంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా రూపుదిద్దుకుంటుందని స్పష్టం చేశారు.


ఏపీలో డేటా సెంటర్ కోసం గత సంవత్సరకాలం నుంచి మంత్రి నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని పెమ్మసాని గుర్తు చేశారు. రూ.90,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్‌ను కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. దానివల్ల 6 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒక్క డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి పదివేల కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. అమరావతిలో క్వాంటం, విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపుదిద్దుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు.


కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తున్నాయని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంత్రి నారా లోకేష్‌ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన పట్టుదల, హార్డ్ వర్క్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. దీనికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు

వెంకటేష్‌ నాయుడి ఫోన్‌ అన్‌లాక్‌కు అనుమతి

Updated Date - Oct 14 , 2025 | 11:31 AM