Home » CM Chandrababu Naidu
అమరావతి చట్టబద్ధత బిల్లుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని అన్నారు.
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనుంది.
తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. కొత్త గేట్లను బిగించేందుకు జరుగుతున్న పనులను సైట్ నుంచే సీఎంకు చంద్రబాబుకు ఫోన్ చేసి వివరించారు మంత్రి.
ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మోహిని అలంకారంలో భక్తులకు కోదండరామయ్య దర్శనమిస్తున్నాడు.
ఏపీలో పేదలు పండుగ చేసుకుంటున్నారు. సొంతింటి కల సాకారమైందంటూ సంబరాలు చేసుకున్నారు. టిడ్కో ఇళ్లకు గృహప్రవేశాలు చేసుకుని, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
ప్రతి పేద కుటుంబానికీ శాశ్వత ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది తన సంకల్పమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వడానికి....
మనం మనుషుల కోసం ఖర్చు చేస్తే దేవుడు మనకు మరింత ఇస్తారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట వేదికగా 2.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. 2,50,893 పేద కుటుంబాలకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహ ప్రవేశం చేయించారు.
తిరుపతి జిల్లా పుడూరులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. రెండో విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఏపీ వ్యాప్తంగా లక్ష టిడ్కో ఇళ్లతో పాటూ మరో లక్షా యాభైవేల గృహాలను లబ్ధాదారులకు అందించనున్నారు. ఈ సందర్భంగా టిడ్కో ఇళ్లను సీఎం పరిశీలించారు.