Amaravati Farmers Issues: రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ ఫోకస్
ABN , Publish Date - Nov 27 , 2025 | 10:25 AM
రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ మరోసారి సమావేశమైంది. రైతుల ప్లాట్లకు హద్దు రాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.
అమరావతి, నవంబర్ 27: రాజధాని రైతుల (Amaravati Farmers) సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. జరీబు - మెట్ట భూముల అంశం, గ్రామ కంఠాలు, అసైన్డ్, లంక భూముల రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. వీలైనంత వరకు త్వరితగతిన సమస్యలు పరిష్కారంపై కమిటీ దృష్టి పెట్టింది. రైతుల ప్లాట్లకు హద్దు రాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. గుంటూరు, మంగళగిరి నుంచి అమరావతికి వచ్చే రోడ్ల అభివృద్ధిపైనా కమిటీలో చర్చ జరిగింది.
ఎల్లుండి (ఈనెల 29) ఉదయం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు పెమ్మసాని, నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అధికారులు హాజరయ్యారు. కాగా.. ఈనెల 22న తొలి సమావేశం జరుగగా.. ఆరునెలల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి పెమ్మసాని అధ్యక్షతన సమావేశం జరిగింది. సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలన్న దానిపై సమావేశంలో చర్చించిన విషయం తెలిసిందే. రైతులు ఎవరూ కూడా అపోహలు నమ్మొద్దని అన్నారు. ఆరు నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
Read Latest AP News And Telugu News