ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ద్వారా పట్టుబడిన రూ.11 కోట్లు బ్యాంకులో సిట్ అధికారులు శనివారం డిపాజిట్ చేశారు. ఆ నోట్లను వీడియో తీయాలని, విడిగానే ఉంచాలని ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు పిటీషన్ వేశారు.
ఏదైనా సంఘటనలు జరిగితేనే స్పందించటం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అలవాటైపోయింది. ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, మెడికల్ ల్యాబ్‌ల వంటి వాటిని క్రమంగా తనిఖీలు చేస్తుంటే, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వంటి మోసాలు ముందే వెలుగులోకి వచ్చేవి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా సృష్టి ఉదంతం తర్వాత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పుడు స్పందించడం, అది కూడా ల్యాబ్‌లు, చిన్నచిన్న క్లినిక్‌లలోనే తనిఖీ చేస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.
మరో నెలా 20 రోజుల్లో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు మొదలవుతాయి. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు, అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ‘సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత’ అనే నినాదాన్ని చెబుతున్న జిల్లా యంత్రాంగం ఏటా ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అనేదే అనుమానం. అంతరాలయ దర్శనాల్లో ఆంక్షలు, ప్రొటోకాల్ వీఐపీల రాకలో పరిమితులు, తిరుమల బ్రహ్మోత్సవాల తరహా విధానాల అమలుతోనే ఈసారైనా సామాన్య భక్తులు అమ్మను కనులారా దర్శించుకుని ఆనందంతో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికలు వేయాల్సిన అవసరం ఉంది.
గత వైసీపీ హయాంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలను సరిచేసే కార్యక్రమానికి ప్రభుత్వం తెరలేపింది. వైసీపీ కార్యకర్తల ముసుగులో ఆ పార్టీ నేతలు, వారి అనుచరులకు అడ్డగోలుగా స్థలాలు ఇచ్చేశారు. కొందరు ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. మరికొందరు ఈ స్థలాలను విక్రయించేశారు.
ఓవైపు లక్షల క్యూసెక్కుల కృష్ణానది నీరు కడలిపాలవుతోంది. మరోవైపు చుక్కనీరు లేక ఎకరాలకు ఎకరాలు నెర్రలిస్తున్నాయి. చెంతనే నిండుకుండలా నీరు ఉబికి వస్తున్నా.. వరి పైరుకు చుక్కనీరు చిక్కలేని విచిత్ర పరిస్థితులు జిల్లా అన్నదాతలను కన్నీటిలో ముంచేశాయి. కొద్దిరోజులుగా వరుణుడు ముఖం చాటేయడం, ఎండలు మండిపోతుండటం, ఎగువ ప్రాంత రైతులు సాగునీటిని దిగువకు రానీయకపోవడం వంటి కారణాల వల్ల పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజక వర్గాల్లో సాగునీటి ఎద్దడి నెలకొంది. నీటిపారుదల శాఖ అధికారుల అనాలోచితన నిర్ణయాల వల్లే ఇలా జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. - మచిలీపట్నం/కూచిపూడి, ఆంధ్రజ్యోతి
వాహనాల ఫిటెనెస్ పరీక్షల కోసం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు (ఏటీఎస్) అవినీతిమయమయ్యాయి. ప్రైవేట్ నిర్వాహకుల చేతికి అప్పగించిన ఈ కేంద్రాల్లో నూతన విధానం నిన్న మొన్నటి వరకు బాగానే అమలు జరిగినా ప్రస్తుతం మాత్రం దారి తప్పాయి. వాహనాల కేటగిరీ ప్రాతిపదికన లంచాల ధరలను నిర్దేశించి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నూతన జేటీసీగా నియమితులైన వడ్డీ సుందర్ ఈ ఏటీఎస్ కేంద్రాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ట్రాఫిక్ క్రమబద్దీకరణలో విజయవాడను ప్రపంచంలోనే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా అన్నారు. నగరంలోని అన్ని కూడళ్లలో త్వరలో ఏఐ ఆధారిత సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులకు దాతలు సమకూర్చిన డ్రోన్లు, ప్రభుత్వం కేటాయించిన ద్విచక్ర వాహనాలను ఆయన పోలీసు కమిషనర్ కార్యాలయంలో గురువారం అందజేశారు.
కార్పొరేషన్ ప్రజారోగ్యశాఖలో అవినీతి, అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కార్మికులకు చెల్లించాల్సిన బిల్లులు మొదలు జీతాల బిల్లులు ట్రెజరీకి పంపడం, సిబ్బంది అంతర్గత సర్దుబాట్ల వరకు ఈ శాఖలోని అధికారులు, ఆఫీసు సిబ్బందికి ఆమ్యామ్యాలు ముట్టజెప్పా ల్సిందే. ఏళ్ల తరబడి ఈ పరిస్థితి కొనసాగుతున్నా ఏ స్థాయిలోనూ అరికట్టలేకపోతున్నారు. ప్రజారోగ్య విభాగమంతా ఇక్కడున్న ఓ ఉద్యోగి కనుసన్నల్లో నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఉధృతంగా.. Intensely..
డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ-2 మూవీలో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.