Share News

Pemmasani Chandrasekhar: ఆ రైతులతో మరోసారి మాట్లాడతాం: పెమ్మసాని చంద్రశేఖర్

ABN , Publish Date - Dec 13 , 2025 | 10:16 AM

రాజధానిలో భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. 2004 మంది ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేదని... వారితో మరోసారి మాట్లాడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

Pemmasani Chandrasekhar: ఆ రైతులతో మరోసారి మాట్లాడతాం: పెమ్మసాని చంద్రశేఖర్
Pemmasani Chandrasekhar

అమరావతి, డిసెంబర్ 13: రాజధానిలో లంక భూముల ఇష్యూ క్లియర్ అయ్యిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) అన్నారు. ఈరోజు (శనివారం) రాయపూడి సీఆర్డీయే కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్ బఫర్ జోన్ తుళ్ళూరులో అడిగారని.. దీని వల్ల 36 ఫ్లాట్లు ఎఫెక్ట్‌ అవుతుండగా దాన్ని 3 కు తగ్గించినట్లు చెప్పారు. దీన్ని సరి చేసిన మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలియజేశారు.


2004 మంది రైతులు ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేదని... వారితో మరోసారి మాట్లాడతామని తెలిపారు. 120 మంది రైతులు ల్యాండ్ ఆల్టర్నేటివ్ అయినా కూడా తీసుకుంటామని అన్నారని చెప్పారు. రోడ్డు శూల ఉన్న భూములకు వాక్ వేలు సరి చేస్తామన్నారు. వాస్తు అనేది ఎండ్ లెస్ అని.. మొదట్లో వాస్తు ప్రకారం చేశారని.. ప్రతీసారి వాస్తు విషయం చూడలేమని స్పష్టం చేశారు. ఎఫ్‌ఎస్‌ఐ తక్కువ ఉందని రైతులు అంటున్నారని.. దీనిపై పునరాలోచన చేయాలని భావిస్తున్నామని తెలిపారు. అవకాశం ఉంటే మాత్రమే చేస్తామని స్పష్టం చేశారు.


26 గ్రామాల్లో డీపీఆర్ చేసి ఇస్తామని చెప్పామని.. బౌండరీ స్టోన్స్‌లను సోమవారం నుంచి రెండు వైపులా వేయనున్నట్లు తెలిపారు. సోషల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కింద 18 కమ్యూనిటీ హాల్‌లు కావాలన్నారని, స్మశానాల విషయంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కూర్చుని చర్చిస్తారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.


సోమవారం తరువాత గ్రామాల్లో సమావేశాలు పెట్టి సోషల్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌లపై, గ్రామ అభివృద్ధి ప్లాన్‌లపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తెలిపారు. అసైన్డ్ ల్యాండ్ విషయంలో ఉన్న సమస్యలను కూడా న్యాయపరమైన చిక్కులు తొలిగాకే సరిచేస్తామన్నారు. ల్యాండ్ ఎక్విజేషన్లలో వచ్చిన వారికి మంత్రి నారాయణ స్వయంగా ఫోన్ చేసి అడిగారని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

నయా ఎక్స్‌ప్రెస్‌ వే.. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌12 నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్‌ వరకు నిర్మాణం..

జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 13 , 2025 | 10:30 AM