Home » Amaravati
బంగారు ఆభరణాల్లో లక్క పెట్టి.. తూకం ఎక్కువగా చూపించి బ్యాంకుల నుంచి రుణం పొందిన విషయం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువులో వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ వ్యవహారం మొత్తం బట్టబయలు కావడంతో పోలీసులు కేసునమోదు చేశారు.
జరీబు, గ్రామ కంఠం ప్లాట్లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటి వరకూ 61,793 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు.
అమరావతి రైతులతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల సమావేశం అయ్యారు. ఈ మీటింగులో జరిగిన చిన్న ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. . అన్నదాతలతో సమావేశం ప్రారంభించే ముందు కొన్ని సూచనలు చేశానని ప్రస్తావించారు.
రాజధానిలో భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. 2004 మంది ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేదని... వారితో మరోసారి మాట్లాడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
అన్నం ఉడకలేదు.. కూరలు అస్సలు బాగో లేవు.. అదే మీ పిలల్లకైతే ఇలాగే పెడతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి. కాలువపల్లి ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఇవాళ(శుక్రవారం) దేవినేని ఉమా కలిశారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తీవ్ర విమర్శలు చేశారు. ‘జగన్ ఆంధ్ర గూండారాజ్ మాత్రమే కాదు... మాఫియా డాన్ కూడా అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఇంకా పలు విమర్శలు చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే రోజు రెండు పీఠాలు వైసీపీ నుంచి టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఇద్దరు మహిళలు పసుపు జెండాకు జై కొట్టించి, పదవులను దక్కించుకున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్‌గా తలారి గౌతమి, రామగిరి ఎంపీపీగా కప్పల సాయిలీల ఎన్నికయ్యారు. రామగిరి ఎంపీపీ ఎన్నికపై కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
జిల్లా కేంద్రం అనంతపురంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించారు. అఖండ-2 సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయిన సందర్భాన్ని పురష్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. అటు బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
సోమందేపల్లి మండలంలో గంజాయి గ్యాంగ్ అరాచకాలు పేట్రేగిపోతున్నాయనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారని, దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు.