Home » Visakhapatnam
గుడివాడ అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారని తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ధ్వజమెత్తారు. అమర్నాథ్ లాగా తాము దిగజారి మాట్లాడమని పేర్కొన్నారు. దిగజారి మాట్లాడేవాళ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేవలం కుల సమీకరణాల కోసమే గత వైసీపీ ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులను ఇచ్చిందని ఆక్షేపించారు.
విశాఖపట్నంలో డేటా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ పూర్తిచేశామని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరకోస్తా తీరం వెంట బలమైన ఈదురు గాలులు ఉంటాయని... ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
మూడేళ్ల క్రితం విశాఖలోని నోవోటల్‌లో నన్ను నిర్బంధిస్తే నా కోసం విశాఖ మొత్తం హోటల్ దగ్గరకు వచ్చింది.. నాకు ఇవ్వడమే తెలుసు.. అడగడం తెలియదన్న పవన్ కళ్యాణ్.. నిలబడే శక్తి నాకు సినిమా ఇచ్చిందన్నారు.
విశాఖకు మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు రాబోతున్నాయని, భవిష్యత్ పెట్టుబడులు, అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మౌలిక వసతులకు లోటు లేకుండా ప్రణాళికలు అమలు చేయాలని..
తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ‘సుపరిపాలనలో ముందడుగు’ అని తెలిపారు.
రామవరంలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం మండలం రామవరం ఐటీసీ గోడౌన్‌లో మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.
తమిళనాడులో పార్టీలు రాజకీయంగా విభేదించినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తాయని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇక్కడ మాత్రం స్వార్థ పూరిత ప్రతిపక్షo ఉండటం దురదృష్టకరమని..
Nimmala Ramanaidu Slams Jagan: 2027, డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. 2025, డిసెంబర్ నాటికి డయాఫ్రంవాల్ పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల మరోసారి స్పష్టం చేశారు. 45.72 మీటర్ల ఎత్తులో ఎలాంటి మార్పు లేదన్నారు.
INS Nistar Launch: ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’ నిర్మాణానికి 120కి పైగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ కంపెనీలు సహకారం అందించాయి. ఈ నౌక 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉంటుంది.