Longest Glass SkyWalk Bridge: దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ స్కై వాక్.. విశాఖలో ప్రారంభం..
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:04 PM
కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిని ఎంపీ భరత్ సోమవారం అధికారికంగా ప్రారంభించారు. ఎంపీ భరత్ సోమవారం అధికారికంగా బ్రిడ్జిని ప్రారంభించారు.
వైజాగ్: దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ స్కై వాక్‌ను విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం విశాఖపట్టనాన్ని పర్యాటక రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో అత్యాధునిక గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో వీఎంఆర్‌డీఏ, ఆర్జే అడ్వెంచర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ బ్రిడ్జిని నిర్మించాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
55 మీటర్ల పొడవుతో దేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిగా రికార్డుకెక్కింది. సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఎంపీ భరత్ సోమవారం అధికారికంగా బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ బ్రిడ్జి 500 టన్నుల భారాన్ని మోయగలదు. అయితే, ఈ వంతెనపైకి ఒకసారి కేవలం 40 మందిని మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ బ్రిడ్జిపైకి ఎక్కి బంగాళాఖాతం, తూర్పు కనుమలు, విశాఖ నగరం అందాలను చూడొచ్చు.
ఫొటోలు, వీడియోలు తీసుకోవాలనుకునే వారికి, థ్రిల్‌ను కోరుకునే వారికి ఈ బ్రిడ్జి అద్భుతమైన అనుభూతిని ఇవ్వనుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సూర్యోదయం, సూర్యాస్తమ సమయాలు ఈ గ్లాస్ బ్రిడ్జిపైనుంచి మరింత అద్భుతంగా కనిపిస్తాయి. బ్రిడ్జి కోసం ఉపయోగించిన గ్లాస్‌ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. హై క్వాలిటీ ట్రిపుల్ లేయర్, 40 ఎమ్ఎమ్ టెంపర్డ్ లామినేషన్‌తో ఈ గ్లాస్ తయారు అయింది. గ్లాసు కింద 40 టన్నుల రీఇన్‌ఫోర్స్‌డ్ స్టీల్ సపోర్టు ఉంటుంది. పర్యాటకులు ఎలాంటి భయం లేకుండా బ్రిడ్జిపై చక్కర్లు కొట్టవచ్చు.
ఇవి కూడా చదవండి
రూపాయి రికార్డు పతనం.. సూచీలకు తప్పని నష్టాలు..
మేడారం ఆలయ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు