Home » ABN
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేయలేదు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది.
రష్యా , జపాన్‌లోని పలు ప్రాంతాలను సునామీ కుదిపేసింది. జపాన్‌లో ఈ ఏడాది అది కూడా జులై మాసంలో సంభవించనుందంటూ గతంలో చెప్పిన జోస్యం నిజమైందంటున్నారు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కలిసి అభివృద్ధి చేసిన నైసార్ (NISAR ) ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపించారు.
నాలుగు రోజుల పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ నుంచి అమరావతికి బయలుదేరారు. రాత్రికి ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు.
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాయలసీమలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా బుధవారం అనంతపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో బుధవారం బ్యారేజీ వద్ద 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత జగన్ రెడ్డి ప్రభుత్వం మూడేళ్ల పాటు రైతులకు ఒక్క రూపాయికే బీమా అంటూ ప్రచారం చేసినా.. వాస్తవానికి నామమాత్రపు బీమా కూడా అమలు చేయకుండా రైతులను వంచించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
బెట్టింగ్ యాప్‌ల కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విచారణ ముగిసింది. ఈ విచారణలో ప్రకాష్ రాజ్‌కు ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుంది. ఆ యా ప్రశ్నలకు ప్రకాష్ రాజ్ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.
ఒకవైపు ఉద్యోగాల్లో కోత. జాబ్ ఉన్నా ఎప్పుడు పోతుందోననే ఒక విధమైన ఆందోళన. మరోవైపు కొత్త అవకాశాలు లేవు.