Cold Waves In Telangana: పెరిగిన చలి.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ABN , Publish Date - Dec 12 , 2025 | 07:34 PM
ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. దాంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 12: ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తున్నాయి. దాంతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని హైదరబాద్లోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు తెలిపింది. ఉత్తర, పశ్చమ, ఈశాన్య జిల్లాల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. శుక్ర, శనివారాల్లో శీతల, అతిశీతల గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.
దాంతో ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం వివరించింది. ఎల్లుండి నుంచి పొగ మంచు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. శీతల గాలులతోపాటు పొగ మంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ కేంద్రం సూచించింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
ఈ రోజు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. దాంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
డిసెంబర్ 13వ తేదీ అంటే.. శనివారం.. ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు సైతం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
డిసెంబర్ 14వ తేదీ.. ఆదివారం.. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్లో చూస్తే రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాలులు ఉత్తర ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు
విశాఖ కాగ్నిజెంట్లో 25 వేల మందికి ఉద్యోగాలు: సీఈవో రవి కుమార్
For More TG News And Telugu News