ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రైవేటు ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయా సెంటర్లపై ఇదివరకే నమోదైన కేసుల వివరాలు సేకరించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు నిఘా వర్గాల అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
సమాజ సంక్షేమానికి కట్టుబడిన ప్రపంచ బౌద్ధ సంస్థ.. బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (బీఎల్ఐఏ). పేద పిల్లలకు ప్రయోజనం చేకూర్చే స్వచ్ఛంద సేవా కార్యక్రమం ద్వారా.. తన నిబద్ధతను మరోసారి చాటుకుంది.
నాంపల్లి కోర్టు కేసుపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాలని స్పష్టం చేసిందని అన్నారు. తనకు ఈ దేశ న్యాయవ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. గులాబీ నేతలు పబ్లిసిటీ కోసం మాత్రమే తమ ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. బీఆర్ఎస్ గాలి మాటలు తప్ప వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో తాజాగా ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు అరెస్టైన నిందితుల సంఖ్య 11కు చేరింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు మహిళలే ఏజెంట్లుగా ఉన్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
బీసీల మెడలు కోసేలా ముస్లింలకు రిజర్వేషన్‌లు ఇవ్వడం అన్యాయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఉద్ఘాటించారు. గత 70 ఏళ్లలో కుల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కులగణన చేయని కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పార్లమెంట్ ముందు ముక్కు నేలకు రాయాలని కిషన్‌రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు.
బ్రిటిష్ పాలకులను తరిమికొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని నొక్కిచెప్పారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ అని అభివర్ణించారు. బీజేపీతో సహా అన్ని పార్టీలు అధికారంలో లేకపోతే ఇంటికే పరిమితమని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.