Akhilesh Yadav Meets Revanth: యూపీ మాజీ సీఎం అఖిలేశ్ పర్యటన.. ఎవరెవర్ని కలిశారంటే..
ABN , Publish Date - Dec 12 , 2025 | 08:01 PM
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు చేరుకున్న అఖిలేశ్.. యాదవ సంఘాల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా యాదవులంతా ఒక్కటేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
హైదరాబాద్: తెలంగాణలో ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పర్యటిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నేతలను కలుస్తూ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. జూబ్లీ హిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన అఖిలేశ్.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. వివిధ రాష్ట్రాలు, జాతీయ స్థాయి రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు.
భేటీ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అఖిలేశ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. ఆ తర్వాత కాసేపటికి నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి అఖిలేశ్ యాదవ్ చేరుకోగా బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావుతో భేటీ అయ్యారు. తెలంగాణ తాజా రాజకీయ అంశాలపై నేతలంతా చర్చించారు.
అనంతరం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు చేరుకున్న అఖిలేశ్.. యాదవ సంఘాల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా యాదవులంతా ఒక్కటేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు. సదర్ సమ్మేళనానికి గొప్పగా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. యూపీలో బీజేపీని వెనక్కి నెడుతున్నామని.. ఏపీ సపోర్ట్ లేకపోతే కేంద్రంలో బీజేపీ వచ్చేది కాదని అఖిలేష్ యాదవ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు
విశాఖ కాగ్నిజెంట్‌లో 25 వేల మందికి ఉద్యోగాలు: సీఈవో రవి కుమార్
For More TG News And Telugu News