Home » Telangana
తెలంగాణలో తొలి విడత గ్రామ పంచయతీ ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. ఎన్నికల కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టామని వాపోతున్నారు.
ఫుట్‌బాల్ స్టార్ మెస్సి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజలను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆర్‌ఆర్ 9 వర్సెస్ మెస్సి ఆల్ స్టార్స్ జట్లు తలబడనున్నాయి.
భారత రాష్ట్ర సమితి పార్టీ కేడర్ దిక్కుతోచని స్థితిలోపడిపోయి ఇళ్లకే పరిమితమైపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందువరకు ఫుల్ జోష్లో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు.. ప్రస్తుతం ఏమి చేయాలో పాలుపోలేని స్థితిలో ఉండిపోతున్నారు. అలాగే పార్టీ అగ్రనేతలు కూడా నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు,
కూకట్పల్లిలోగల జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ(జేఎన్టీయూ)లో నాన్‌బోర్డర్స్‌పై అధికార యంత్రాంగం కొరడా ఘుళిపిస్తోంది. ఈ మేరకు క్వార్టర్స్ ఖాళీ చేయకుంటే పీహెచ్‌డీ డిగ్రీలు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ మహా నగరంలోరి కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు తక్కువ ధరకు విక్రయించిన బెండకాయ... ప్రస్తుతం రూ. 55 నుంచి రూ. 65 వరకు విక్రయిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. భార్యను ఉరివేసి హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.
హైదరాబాద్ మహా నగరంలోమరో కొత్త ఎక్స్‌ప్రెస్ వే కు అడుగులు పడుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని జనవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 4వతేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతుప్పారు. సికింద్రాబాద్-అనకాపల్లితోపాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.
చలిపులి చంపేస్తోంది. హైదరాబాద్ నగరంలో అత్యల్ప స్థాయికి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే వణికిపోవాల్సిన పరిస్థిది నెలకొంది. ప్రధానంగా చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లు ఈ చలిపుటి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లో శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తునకనట్లు తెలిపారు.