Share News

Sankranthi special trains: జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..

ABN , Publish Date - Dec 13 , 2025 | 08:24 AM

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని జనవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 4వతేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతుప్పారు. సికింద్రాబాద్‌-అనకాపల్లితోపాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.

Sankranthi special trains: జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్‌: సంక్రాంతి పండగ(Sankranti festival) సందర్భంగా ప్రయాణికుల డిమాండ్‌ మేరకు పలు ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 4, 11, 18 తేదీల్లో (ఆది) సికింద్రాబాద్‌-అనకాపల్లె(07041), జనవరి 5, 12, 19 తేదీల్లో(సోమ) అనకాపల్లె- సికింద్రాబాద్‌ (07042) రైలును నడుపనున్నారు. జనవరి 9,16,23 తేదీల్లో (శుక్ర) హైదరాబాద్‌-గోరక్‌పూర్‌(07075), జనవరి 11, 18, 25 తేదీల్లో (ఆది) గోరక్‌పూర్‌-హైదరాబాద్‌ (07076) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈనెల 21న మచిలీపట్నం- అజ్మీర్‌ (07274), 28న అజ్మీర్‌-మచిలీపట్నం(07275) మధ్య ప్రత్యేక రైలును నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.


శబరిమలకు..

శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం జనవరి నెలలో నాలుగు ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. చర్లపల్లి-కొల్లాం మార్గంలో నడిచే 07135/07136 ప్రత్యేకరైళ్లకు కాచిగూడ, కర్నూలు, డోన్‌, గుత్తి, కడప, తిరుపతి, కాట్పాడి, ఈరోడ్‌, త్రిచూర్‌, ఎర్నాకుళం స్టేషన్లలో హాల్ట్‌ సౌకర్యం కల్పించారు. 07135 ప్రత్యేకరైలు జనవరి 14, 21తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లాంకు బయల్దేరనుండగా, తిరుగు ప్రయాణంలో 07136 ప్రత్యేకరైలు కొల్లాం నుంచి చర్లపల్లికి బయల్దేరనుందని రైల్వే అధికారులు వెల్లడించారు.


city4.2.jpg

‘జన్మభూమి’ వేళల్లో మార్పు..

విశాఖపట్నం-లింగంపల్లి మార్గంలో నడుస్తున్న జన్మభూమి (12805/12806) ఎక్స్‌ప్రెస్‌ రైలు వేళల్లో మార్పులు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. ఈ మార్పులు ఫిబ్రవరి 15నుంచి (ఇరువైపులా)అమల్లోకి వస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ వెల్లడించారు.


జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ లింగంపల్లిలో ఫిబ్రవరి 15నుంచి

ప్రతిరోజూ ఉదయం 6.55గంటలకు, బేగంపేట 7.20, సికింద్రాబాద్‌ 7.40, చర్లపల్లి నుంచి 8గంటలకు బయల్దేరనుంది. తిరుగుప్రయాణంలో విశాఖపట్నం నుంచి ప్రతిరోజూ ఉదయం 6.20గంటలకు బయల్దేరి, చర్లపల్లికి సాయంత్రం 6.05, సికింద్రాబాద్‌ 6.30, బేగంపేట 6.42, లింగంపల్లికి రాత్రి 7.15 గంటలకు చేరుకోనుంది. ఆయా స్టేషన్లలోనూ మార్పులు ఉంటాయని, ప్రయాణికులు మారిన వేళలను గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చదవడం లేదని..బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్‌ టీచర్‌

మా ఊరికి రోడ్డు వేయరూ..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 13 , 2025 | 08:54 AM