Home » Hyderabad
టీటీడీకి అనుసంధానంగా ఆగమ శాస్త్రం ప్రకారం కొడంగల్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు.
పిల్లల కోసం తపిస్తున్న దంపతుల ఆశను ఆసరాగా చేసుకొని, ఐవీఎఫ్, సరోగసిని వ్యాపారంగా మార్చి దందాకు పాల్పడుతున్న సంతాన సాఫల్య కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆ శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
బీజేపీని బద్నాం చేయడానికే సీఎం రేవంత్ ఢిల్లీ వెళుతున్నారని, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు.
విద్యా రంగంలో నూతన సంస్కరణలు తీసుకురావడానికి నారాయణ విద్యాసంస్థలు, గూగుల్ క్లౌడ్ ఇండియా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం కేసులో ముగ్గురు నిందితులను గోపాలపురం పోలీసులు ఇంటరాగేట్ చేశారు. తమ కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రతను, చంచల్‌గూడ జైలు నుంచి తీసుకొచ్చిన విశాఖ సృష్టి కేంద్రం మేనేజర్ కళ్యాణిని, మరో నిందితురాలు సంతోషిని నార్త్‌జోన్ కార్యాలయంలో ఒకే చోట ఉంచి ప్రశ్నించారు.
వయసు కనిపించొద్దు.. చర్మం ముడతలు పడొద్దు.. లావుగా అనిపించొద్దు.. నిత్యం యవ్వనంగా మెరుస్తూ, మురిసిపోవాలి.. ఇటీవల ఎంతో మందిలో కనిపిస్తున్న ఆశ ఇది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు నిఘా వర్గాల అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
సమాజ సంక్షేమానికి కట్టుబడిన ప్రపంచ బౌద్ధ సంస్థ.. బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (బీఎల్ఐఏ). పేద పిల్లలకు ప్రయోజనం చేకూర్చే స్వచ్ఛంద సేవా కార్యక్రమం ద్వారా.. తన నిబద్ధతను మరోసారి చాటుకుంది.
నాంపల్లి కోర్టు కేసుపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాలని స్పష్టం చేసిందని అన్నారు. తనకు ఈ దేశ న్యాయవ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.