Home » Trains
ఓ వ్యక్తి పాకిస్తాన్ రైల్లో ప్రయాణిస్తూ లోపలి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. రైల్లో కొంత మంది సీట్లలో కూర్చుని ఉండగా.. మరికొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే చివరకు అక్కడి దృశ్యాలు చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి - పాట్నా మధ్య నడిచే స్పెషల్ వీక్లీ రైళ్లను పొడిగించి (స్టేషన్ల సంఖ్య పెంపు) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (03253) పాట్నా - చర్లపల్లి మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలు సోమ, బుధవారాల్లో ఈ నెల 4 నుంచి 29 వరకు జహనాబాద్ వరకు పొడిగించి నడిపిస్తున్నట్లు చెప్పారు.
కాకినాడ పోర్టు నుంచి విజయవాడకు వెళ్లే ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో సరైన టాయిలెట్ సౌకర్యాలు లేకపోవడంతో ప్యాసింజర్లు ఇక్కట్లు పడుతున్నారు. దీనిపై ABN గ్రౌండ్ రిపోర్ట్ చదవండి.
దేశప్రజలు అక్టోబరు 1,2 తేదీల్లో ఆయుధ పూజ, విజయదశమి పండుగలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకార్యర్ధం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ముందుస్తు రిజర్వేషన్ శనివారం నుంచి ప్రారంభమైంది. ప్రజల సౌకర్యార్ధం ప్రయాణానికి 60 రోజులు ముందుగా రైలు టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఓనం పండుగను పురస్కరించుకుని చెన్నై సెంట్రల్-కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.06119 చెన్నై సెంట్రల్-కొల్లం వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 27, సెప్టెంబరు 3,10 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు కొల్లం చేరుకుంటుంది.
ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సెప్టెంబర్ 9న భారత గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రైలుయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఆగ్నేయ రైల్వే చక్రధర్‌పూర్ డివిజన్ ఝార్సుగూడ గూడ్స్ యార్డ్ పునర్నిర్మాణానికి సంబంధించి నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
కాచిగూడ-మైసూరు ఎక్స్‌ప్రెస్ రైలు (12785, 12786)ను అశోకపురం వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కాచిగూడ- మైసూరు-కాచిగూడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు ఇక నుంచి కాచిగూడ-అశోకపురం-కాచిగూడ మధ్య నడపడానికి రైల్వే బోర్డు అనుమతించిందన్నారు.
ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.07191 కాచిగూడ-మదురై స్పెషల్ ఆగస్టు 18 నుంచి అక్టోబరు 10వ తేది వరకు (సోమవారం) 9 సర్వీసులు, నెం.07192 మదురై-కాచిగూడ స్పెషల్ ఆగస్టు 20 నుంచి అక్టోబరు 15వ తేది (బుధవారం) వరకు 9 సర్వీసులు పొడిగించారు.
అతిపెద్ద మహిళల అక్రమ రవాణా గుట్టును రైల్వే పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి బిహార్ తరలిస్తున్న 56 మంది యువతులను కాపాడారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి దుర్మార్గానికి పాల్పడిన ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.