Lovers in Train Video: వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..
ABN , Publish Date - Nov 27 , 2025 | 03:38 PM
రన్నింగ్ రైల్లో ఓ యువకుడు, మహిళ చేసిన నిర్వాకం అందరికీ కోపం తెప్పిస్తోంది. బోగీ డోరు వద్ద ప్రమాదకరంగా నిలబడ్డ వారు.. ఏకంగా అక్కడే సరసాలు మొదలెట్టారు. పక్కన ప్రయాణికులు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా ఆ వ్యక్తి..
ప్రేమికుల ప్రవర్తన కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ఉంటుంది. కొందరు జనాల మధ్యలో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే.. మరికొందరు ఏకంగా కదులుతున్న బైకులు, కార్లలో సరసాలు సాగిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రైల్లో ఓ మహిళ, యువకుడు చేసిన నిర్వాకానికి సబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రన్నింగ్ రైల్లో డోరు వద్ద నిలబడి వారు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. రైల్లో ఇవేం పనులురా అయ్యా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రన్నింగ్ రైల్లో ఓ యువకుడు, మహిళ చేసిన నిర్వాకం అందరికీ కోపం తెప్పిస్తోంది. బోగీ డోరు వద్ద (Couple Standing at Train Door ) ప్రమాదకరంగా నిలబడ్డ వారు.. ఏకంగా అక్కడే సరసాలు మొదలెట్టారు. పక్కన ప్రయాణికులు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా ఆ వ్యక్తి.. సదరు మహిళను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతన్ని వారించాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా నవ్వుకుంటూ ఉంది.
ఆ సమయంలో వారు ఏమాత్రం అదుపు తప్పినా రైలుపై నుంచి కిందపడే ప్రమాదం ఉంటుంది. అయినా వారు ఇదేమీ పట్టించుకోకుండా డోరు వద్ద నిలబడి వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. వీరిని చూసిన ప్రయాణికులు అవాక్కయ్యారు. కొందరు వారిని వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సీట్లు ఖాలీగా ఉన్నా కూడా వీరు అక్కడ నిలబడి ఉన్నారంటే.. అర్థం చేసుకోవచ్చు’.. అంటూ కొందరు, ‘ఈ తరం ఎటువైపు వెళ్తోందో అర్థం కావడం లేదు’.. అంటూ మరికొందరు, ‘కొత్తగా పెళ్లైన వారికి ఇలాగే ఉంటుంది’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1500కు పైగా లైక్‌లు, 2.97 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో..
ఈ విద్యార్థులను పట్టుకోవడం ఎవరితరమూ కాదేమో.. ఎలా కాపీ కొడుతున్నారో చూడండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి