Hair Cut Funny Video: కటింగ్ చేస్తున్నాడా.. కత్తితో కోస్తున్నాడా.. ఇతడి నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:54 AM
ఓ వ్యక్తి ఆరు బయట కుర్చీ వేసి, ఓ యువకుడికి కటింగ్ చేస్తున్నాడు. ఇందులో నవ్వుకోవడానికి, అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. అందరిలా కత్తెరతో కటింగ్ చేసి ఉండుంటే.. చర్చించాల్సిన పనే ఉండేది కాదు. అయితే ఇతను కటింగ్ చేసే విధానం పూర్తి విరుద్ధంగా ఉంది..
కళ్ల ముందు కాస్త వినూత్నంగా ఏ సంఘటన జరిగినా.. అది ఇట్టే సోషల్ మీడియాలోకి వచ్చి చేరుతుంటుంది. ఆ వైంటనే వైరల్ అయిపోతుంటుంది. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కటింగ్ చేసే విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. కటింగ్ చేస్తున్నాడా.. కత్తితో కోస్తున్నాడా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Videos) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆరు బయట కుర్చీ వేసి, ఓ యువకుడికి కటింగ్ చేస్తున్నాడు. ఇందులో నవ్వుకోవడానికి, అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. అందరిలా కత్తెరతో కటింగ్ చేసి ఉండుంటే.. చర్చించాల్సిన పనే ఉండేది కాదు. అయితే ఇతను కటింగ్ చేసే విధానం పూర్తి విరుద్ధంగా ఉంది.
కత్తి, సుత్తి తీసుకుని వచ్చాడు. తలపై కత్తి పెట్టిన అతను.. సుత్తితో దాన్ని సుతిమెత్తగా ( Man Cutting With Knife And Hammer) కొడుతూ జుట్టును కత్తిరించాడు. చెక్కపై కత్తి పెట్టి ఎలాగైతే కొడతారో.. అలాగే ఇతను జుట్టును కత్తించేశాడు. ఆ తర్వాత బ్లేడు తీసుకుని నేరుగా తలపై నేరుగా గీకుతూ జుట్టును కత్తిరించాడు. అతను వెనుక పెద్ద పెద్ద చెక్క మొద్దులు ఉన్నాయి. జుట్టును కత్తిరించిన తర్వాత.. కత్తిని తీసుకుని మొద్దుపై పెట్టాడు. అక్కడ మరిన్ని కత్తులు, గడ్డపారలు ఉన్నాయి.
చూస్తుంటే ఇదంతా సరదా కోసం చేసినట్లుగా ఉన్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సుత్తితో కటింగ్ సూపర్‌గా ఉంది’.. అంటూ కొందరు, ‘ఇతడి ప్రయాణం వడ్రంగి నుంచి క్షౌరశాల వరకూ చేరుకుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 75 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇలా చనిపోతుందని ఎవరైనా అనుకున్నారా.. ఎద్దుల బండి నడుపుతుండగా..
బొద్దింకలతో కాఫీ.. దీని రేటు, ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి