Rhino Viral Video: జింక పిల్లపై హైనా దాడి.. సడన్‌గా ఎదురొచ్చిన ఖడ్గమృగం.. చివరికి ఏమైందో చూస్తే..
ABN , Publish Date - Nov 22 , 2025 | 09:52 PM
ఆకలితో ఉన్న హైనాకు ఓ జింకపిల్ల కనిపించింది. జింకపిల్లను చూడగానే హైనా దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో జింక పిల్ల ప్రాణభయంతో పరుగులు తీసింది. ఇంతలో ఓ ఖడ్గమృగం అటుగా వచ్చింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
అడవి జంతువుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చంపడానికి వెళ్లే పులులు, సింహాలు, హైనాలకు అప్పుడప్పుడూ చావుదెబ్బ తగులుతుంటుంది. మరికొన్నిసార్లు చిన్న జంతువులను కూడా వేటాడలేక నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ హైనా జింక పిల్లపై దాడి చేయాలని చూస్తుంది. అదే సమయంలో ఖడ్గమృగం ఎదురుగా వస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న హైనాకు ఓ జింకపిల్ల కనిపించింది. జింకపిల్లను చూడగానే హైనా (Hyena attacks baby deer) దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో జింక పిల్ల ప్రాణభయంతో పరుగులు తీసింది. ఇంతలో ఓ ఖడ్గమృగం అటుగా వచ్చింది. పరుగెడుతున్న జింక పిల్ల నేరుగా ఖడ్గమృగం సమీపానికి వెళ్లింది.
జింక పిల్లను చూడగానే ఖడ్గమృగానికి పరిస్థితి అర్థమవుతుంది. జింక పిల్లను కాపాడేందుకు వెంటనే రంగంలోకి దిగింది. హైనా మీదకు దాడి (Rhino attacking hyena) చేయడానికి వెళ్లింది. ఖడ్గమృగం ఎంటరవడంతో హైనా వణికిపోయింది. దెబ్బకు జింక పిల్లను వదిలేసి దూరంగా పారిపోయింది. ఇలా ఆ ఖడ్గమృగం జింక పిల్ల (Rhino saves baby deer) ప్రాణాలను కాపాడిందన్నమాట. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది.
కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఖడ్గమృగమా.. మజాకా.. ’.. అంటూ కొందరు, ‘హైనాకు చుక్కలు చూపించిన ఖడ్గమృగం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 730కి పైగా లైక్‌లు, 1.13 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇలా చనిపోతుందని ఎవరైనా అనుకున్నారా.. ఎద్దుల బండి నడుపుతుండగా..
బొద్దింకలతో కాఫీ.. దీని రేటు, ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి