Cockroach Coffee: బొద్దింకలతో కాఫీ.. దీని రేటు, ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:08 PM
మనం అసహ్యించుకునే బొద్దింకలు.. వారికి కమ్మటి కాఫీని అందిస్తున్నాయి. బొద్దింకలతో తయారీ చేసే కాఫీని అక్కడి వారు ఎంతో ఇష్టంగా తాగుతున్నారట. ఓ మ్యూజియం నిర్వాహకులు.. ఈ బొద్దింకల కాఫీని పరిచేయం చేశారు. ఇంతకీ ఈ బొద్దింకల కాఫీ ఎలా తయారు చేస్తారు.. దీని రేటు తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బొద్దింక.. ఈ పేరు వింటేనే ఒంట్లో ఒక విధమైన జలదరింపు స్టార్ట్ అవుతుంది. ఇక అవి ఎదురుగా కనిపిస్తే.. వెంటపడి చంపేవరకూ మనసుకు ప్రశాంతత ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి అసహ్యకరమైన బొద్దింకలు.. అక్కడి వారికి ఎంతో ఇష్టం. బొద్దింకలతో ఏకంగా కాఫీ కూడా చేసేస్తున్నారు. ఈ కాఫీని అక్కడి వారు లొట్టలేసుకుంటూ తాగుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మనం అసహ్యించుకునే బొద్దింకలు.. చైనా (China) వాసులకు కమ్మటి కాఫీని (Cockroach Coffee) అందిస్తున్నాయి. బొద్దింకలతో తయారీ చేసే కాఫీని అక్కడి వారు ఎంతో ఇష్టంగా తాగుతున్నారట. చైనా బీజింగ్‌లోని ఓ మ్యూజియం నిర్వాహకులు.. ఈ బొద్దింకల కాఫీని పరిచేయం చేశారు. జూన్ నెలాఖరులో ఈ కొత్తరకం కాఫీని ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ కాఫీ ప్రజాదరణ పొందిందని నిర్వాహకులు చెబుతున్నారు. మ్యూజియంలో ప్రస్తుతం రోజుకు 10 కప్పులకు పైగా బొద్దింకల కాఫీ అమ్ముడవుతోందట. ఒక కప్పు కాఫీని 45 యువాన్లకు (సుమారు రూ.570లు) విక్రయిస్తున్నారు. అయినా చాలా మంది ఈ కాఫీని తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కాఫీ సాధారణ కాఫీలాగా తీయగా కాకుండా కాస్త పుల్లగా, కాలిన వాసన వస్తుంటుందని తాగిన వారు చెబుతున్నారు.

ఎలా తయారు చేస్తారంటే..
ఈ ప్రత్యేకమైన కాఫీ తయారు చేసేందుకు.. ముందుగా బొద్దింకలను సేకరించి, వాటన్నింటినీ బాగా ఎండబెడతారు. ఆ తర్వాత వాటిని మెత్తని పొడిలాగా చేస్తారు. చివరగా ఆ పొడిని కాఫీ పొడిలో మిక్స్ చేస్తారు. ఇంకా ఇందులో ఎండిన పసుపు రంగు పురుగుల (Yellow Mealworm) పొడిని కూడా కలుపుతారట. బొద్దింకలను చైనాలో సాంప్రదాయ వైద్యంలో కొన్ని శతాబ్ధాలుగా వినియోగిస్తున్నారట. ఈ బొద్దింకల పొడి తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా అక్కడి వారు నమ్ముతారు. దీంతో ఈ బొద్దింకల కాఫీకి రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోందన్నమాట.
చైనాలోని చాలా మ్యూజియంలలో ఇలాంటి విచిత్రమైన పానీయాలు చాలా తయారు చేస్తుంటారు. కొన్నిచోట్ల పానీయాల్లో వేయించిన పురుగులను కలుపుతారు. అలాగే మరికొన్ని చోట్ల ఘాటైన మిరపకాయల పొడితో కూడా వింత పానీయాలను తయారు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ బొద్దింకల కాఫీ.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి