Share News

Snake Viral Video: పాముతో డేంజరస్ స్టంట్స్.. తలను నోట్లో పెట్టుకుని మరీ..

ABN , Publish Date - Nov 19 , 2025 | 09:19 PM

ఓ పెద్దాయన చేతిలో సంచితో రోడ్డు పక్కన ఇళ్ల ముందు ఆగాడు. అంతా అతన్ని కొత్తగా చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆ వ్యక్తి సంచిలో నుంచి ఓ పామును బయటికి తీశాడు. పామును ఆడించి డబ్బులు అడుగుతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ..

Snake Viral Video: పాముతో డేంజరస్ స్టంట్స్.. తలను నోట్లో పెట్టుకుని మరీ..

పాము అంటే భయపడని వారు ఉండరు. అలాంటిది.. ఇక పాము ఎదురుగా వస్తే వంట్లో వణుకు పుట్టాల్సిందే. అదే పాము కళ్లెదురుగా వస్తే.. గుండె ఆగినంత పనవుతుంది. కానీ ఇదంతా కొందరి విషయంలోనే జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది పాములతో పరాచికాలు ఆడుతూ ఉండడం చూశాం. వారిలో కొందరైతే ఏకంగా పామును పూలదండలాగా మెడలో వేసుకోవడం, వాటిని ఏకంగా నడుముకు చుట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి షాకింగ్ స్టంట్స్ చేస్తుంటారు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ తాత పాముతో చేసిన విన్యాసాలు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. తాతా ఏంటీ పని.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్దాయన చేతిలో సంచితో రోడ్డు పక్కన ఇళ్ల ముందు ఆగాడు. అంతా అతన్ని కొత్తగా చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆ వ్యక్తి సంచిలో నుంచి ఓ పామును బయటికి తీశాడు. పామును ఆడించి డబ్బులు అడుగుతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ అతను అలా చేయలేదు. పామును నేలపై వేసి, బుసలు కొట్టేలా చేశాడు.


ఆ తర్వాత దానికి ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. ముద్దు పెట్టడమే కాకుండా ఏకంగా పాము తలను (Old Man Put the Snake's Head in His Mouth) నోట్లో పెట్టేసుకున్నాడు. పాముకు కాటేసే అవకాశం ఇవ్వకుండా దాని నోరు మూసి, తన నోటితో గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత అలాగే పైకి లేచి కాసేపటి నిలబడ్డాడు. పాము అతడి నోటి నుంచి విడిచించుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. అతను మాత్రం దాన్ని విడిచిపెట్టకుండా అలాగే నోటితో గట్టిగా పట్టుకున్నాడు. ఇలా చాలా సేపు పట్టుకుని ఆ తర్వాత దాన్ని వదిలేసి, యథావిధిగా సంచిలో వేసుకున్నాడు.


ఇలా ఈ పెద్దాయన పాముతో వినూత్న విన్యాసం చేసి అంతా షాక్ అయ్యాలా చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇతడిని చూస్తే పాముకు కూడా భయం’.. అంటూ కొందరు, ‘పాము కోరలు పీకేసి, ఇలా విన్యాసాలు చేయడం దారుణం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2100కి పైగా లైక్‌లు, 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..

వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 19 , 2025 | 09:19 PM