Share News

Reels in Police Vehicle: ఏంట్రా ఇదీ.. పోలీస్ వాహనాన్ని వీరెలా వాడారో చూస్తే..

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:10 PM

ఇద్దరు యువకులు రీల్స్ చేసే క్రమంలో వినూత్నంగా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఏకంగా పోలీసు వాహనంపైనే కన్నేశారు. వాహనం ఖాళీగా ఉండడం చూసి.. తమ షూటింగ్ స్టార్ట్ చేశారు. చివరకు ఏమైందో మీరే చూడండి..

Reels in Police Vehicle: ఏంట్రా ఇదీ.. పోలీస్ వాహనాన్ని వీరెలా వాడారో చూస్తే..

రీల్స్.. ఇది ప్రస్తుతం యువకుల దినచర్యగా మారింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రీల్స చేయడమనేది కామన్ అయిపోయింది. ఇక రీల్స్ చేసేవాళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. నెటిజన్ల దృష్టిలో పడేందుకు వారు వేయని వేషాలు ఉండవు. కొందరు విచిత్ర వస్త్రధారణతో ఆకట్టుకుంటుంటే.. మరికొందరు వినూత్న విన్యాసాలతో వైరల్ అవ్వాలని చూస్తుంటారు. అలాగే ఇంకొందరు.. ఎవరూ చేయని సాహసాలు చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటారు. పనిలోపనిగా ఫేమస్ అయిపోతుంటారు. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, ఇద్దరు యువకులు చేసిన రీల్ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. వినూత్నంగా రీల్ చేయాలనే ఉద్దేశంతో చివరికి వారు ఏకంగా పోలీస్ వాహనాన్నే ఎంచుకున్నారు. హీరోల లెవల్లో బిల్డప్ ఇస్తూ కారులో రీల్స్ చేశారు. చివరకు ఏమైందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆదిలాబాద్ (Adilabad ) జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు రీల్స్ చేసే క్రమంలో వినూత్నంగా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఏకంగా పోలీసు వాహనంపైనే కన్నేశారు. వాహనం ఖాళీగా ఉండడం చూసి.. తమ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఓ యువకుడు పోలీసు కారు మధ్య సీటులో కూర్చున్నాడు. మరో యువకుడు ముందు వైపు కూర్చన్నాడు. స్టార్ట్ కెమెరా.. యాక్టన్.. అనగానే ముందు వైపు ఉన్న వ్యక్తి కారు దిగి.. వెనుక వైపు డోరు తీశాడు. దీంతో చివరగా మధ్యలో కూర్చున్న వ్యక్తి.. హీరో లెవల్‌లో ఎంట్రీ ఇచ్చేశాడు.


వీడియో బాగా రావడంతో సంబరపడిపోయి.. దాన్ని వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముందీ.. పోలీస్ కారులో (Reels in police vehicle ) యువకులు వీడియో తీయడం కొత్తగా కనిపించడంతో వీడియో వైరల్ అయింది. చివరగా ఇది కాస్తా పోలీస్ ఉన్నతాధికారుల కంట్లో పడింది. పోలీస్ వాహనంలో పబ్లిక్ రీల్స్ చేయడం ఏంటంటూ మండిపడ్డారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆదిలాబాద్​ వన్​ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రీల్స్ చేసిన యువకుల కోసం‌ గాలింపు చర్యలు చేపట్టారు.


యువకులు పోలీస్ వాహనంలో రీల్స్ చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీస్ సిబ్బంది చనువుతోనే ఇలా చేశారా.. లేక వాహనాన్ని పోలీసులకు తెలీకుండా తీసుకెళ్లి వీడియోలు తీశారా.. అనే కోణంలో విచారిస్తున్నారు. ఏదిఏమైనా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పోలీస్ వాహనాన్ని ఇంతకంటే ఎవరూ బాగా వాడలేరేమో’.. అంటూ కొందరు, ‘ఇదంతా పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగి ఉంటుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..

వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 19 , 2025 | 05:10 PM