Share News

Car Funny Video: కారు యజమానిపై జాలిపడుతున్న నెటిజన్లు.. సైడ్ మిర్రర్ చూడగా..

ABN , Publish Date - Nov 08 , 2025 | 07:26 AM

రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నాయి. అయితే అందులో ఓ ఫార్చునర్ కారు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతగా అందులో ఏం స్పెషాలిటీ ఉందని అనుకుంటున్నారా.. స్పెషాలిటీ అంటూ ఏమీ లేదు గానీ.. కారు సైడ్ మిర్రర్ స్థానంలో అతను చేసిన చిన్న మార్పే ఇందుకు కారణం. సాధారణంగా..

Car Funny Video: కారు యజమానిపై జాలిపడుతున్న నెటిజన్లు.. సైడ్ మిర్రర్ చూడగా..

కొందరు విచిత్రమైన వాహనాలను వాడుతుంటారు. మరికొందరు తమ వాహనాలనే విచిత్రంగా మార్చేస్తుంటారు. ఇంకొందరు తమ వాహనాల్లో వివిధ రకాల మార్పులు చేసి అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఓ వ్యక్తి తన కారు సైడ్ మిర్రర్‌ను ఎలా మార్చాడో చూస్తే మీరు కూడా అవాక్కవుతారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నాయి. అయితే అందులో ఓ ఫార్చునర్ కారు (Fortuner car) మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతగా అందులో ఏం స్పెషాలిటీ ఉందని అనుకుంటున్నారా.. స్పెషాలిటీ అంటూ ఏమీ లేదు గానీ.. కారు సైడ్ మిర్రర్ స్థానంలో అతను చేసిన చిన్న మార్పే ఇందుకు కారణం. సాధారణంగా కారు సైడ్ మిర్రర్ పగిలిపోతే ఎవరైనా దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేసుకుంటారు.


అయితే ఇతను మాత్రం.. అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు. విరిగిపోయిన సైడ్ మిర్రర్ స్థానంలో ఇంట్లో ముఖం చూసుకునే అద్దాన్ని ఫిట్ చేశాడు. అద్దాన్ని పెట్టి, దానిపై టేప్ అతికించేశాడు. దీంతో ఈ సైడ్ మిర్రర్ కాస్తా.. దారిన వెళ్లే వారి దృష్టిని ఆకర్షిస్తోంది. అంత కాస్ట్‌లీ కారుకు సైడ్‌మిర్రర్ (Side mirror) స్థానంలో ఇలా ఇంట్లోని అద్దాన్ని ఏర్పాటు చేయడం అందరికీ వింతగా అనిపించింది. దారిన వెళ్లే వారు ఈ కారును వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘టయోటా ఒరిజినల్ గ్లాస్.. రూ.1200కి దొరుకుతుంది’.. అంటూ కొందరు, ‘అసలు సిసలు జుగాద్ అంటే ఇదే’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 34 వేలకు పైగా లైక్‌లు, 1.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ముల్లు తీసేందుకు తంటాలు పడుతున్నారా.. ఈ ట్రిక్ తెలిస్తే అవాక్కవుతారు..

ఈ వరుడు మరీ ఫాస్ట్‌గా ఉన్నాడుగా.. కెమెరామెన్‌కు ఎలా షాకిచ్చాడంటే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 07:26 AM