Share News

Trick Viral Video: ముల్లు తీసేందుకు తంటాలు పడుతున్నారా.. ఈ ట్రిక్ తెలిస్తే అవాక్కవుతారు..

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:28 AM

ఓ మహిళకు వేలిలో ముల్లు గుచ్చుకుంది. దాన్ని బయటికి తీసేందుకు ఆమె తెగ తంటాలు పడింది. అయినా ముల్లు మాత్రం బయటికి రాలేదు. ఈ క్రమంలో ఓ మహిళ తన బుర్రకు పదును పెట్టింది. ముల్లు తీసే పద్ధతి అది కాదంటూ.. తన ట్రిక్‌ను బయటపెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది..

Trick Viral Video: ముల్లు తీసేందుకు తంటాలు పడుతున్నారా.. ఈ ట్రిక్ తెలిస్తే అవాక్కవుతారు..

కొందరు పెద్ద పెద్ద సమస్యలకు సింపుల్ పరిష్కారాలను కనుక్కుంటుంటారు. మరికొందరు కళ్ల ముందున్న వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. ఒక వస్తువును అంతా ఒకే విధంగా వాడితే.. వీరు మాత్రం దాన్ని వివిధ రకాలుగా వాడుతుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వేలిలో గుచ్చుకున్న ముల్లును ఓ మహిళ ఎంతో సింపుల్‌గా తీసేసింది. ఈమె టెక్నిక్ చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళకు వేలిలో ముల్లు గుచ్చుకుంది. దాన్ని బయటికి తీసేందుకు ఆమె తెగ తంటాలు పడింది. అయినా ముల్లు మాత్రం బయటికి రాలేదు. ఈ క్రమంలో ఓ మహిళ తన బుర్రకు పదును పెట్టింది. ముల్లు తీసే పద్ధతి అది కాదంటూ.. (Woman trick video) తన ట్రిక్‌ను బయటపెట్టింది.


ఇందుకోసం ఆమె సింపుల్‌గా వంటింట్లో వెల్లుల్లిని (garlic) తీసుకొచ్చింది. దాని తొక్క తీసి ముల్లు ఉన్న ప్రాంతంలో పెట్టింది. ఆ తర్వాత దానిపై బ్యాండేజ్‌ను అతికించింది. ఇలా కొద్ది సేపటి తర్వాత.. ఆ బ్యాండేజ్‌ను తీసేసింది. వెల్లుల్లిని పక్కకు తీసి చూడగా.. ఆశ్చర్యకరంగా వేలిలో (Removing splinter from finger) లోపల ఉన్న ముల్లు పైకి వచ్చేసింది. ఇలా ముల్లును ఎంతో సింపుల్‌గా తీసేసిందన్నమాట. ముల్లు తీయడానికి ఈమె వాడిన వినూత్నమైన ట్రిక్ చూసి అంతా అవాక్కవుతున్నారు.


అయితే కొందరు దీన్ని కొట్టిపడేస్తున్నారు. ఇదంతా వ్యూస్ కోసం చేశారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి వాళ్లు ఉంటే ఆస్పత్రులతో పనే లేదు’.. అంటూ కొందరు, ‘ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా ఉంది.. అలా జరగడం అసాధ్యం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 2.24 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

లగేజీ చూసి.. అంతా లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..

రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 07 , 2025 | 11:29 AM