Car Viral Video: కారు సన్‌రూఫ్ తయారు చేసింది ఇందుకా.. ఇతనెలా వాడాడో చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Nov 02 , 2025 | 08:23 AM
రోడ్డుపై సన్‌రూఫ్ ఉన్న కారు దూసుకుపోతోంది. ఇందులో అవాక్కడానికి ఏముందీ... అనేగా మీ సందేహం. కారు దూసుకుపోవడంలో వింతేమీ లేకున్నా కూడా.. కారు సన్‌రూఫ్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
వాహనాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాగే వాహనాలను విచిత్రంగా వాడే విధానం కూడా కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటుంది. మరికొందరు వాహనాలను వాడే విధానం చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కారు సన్‌రూఫ్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై సన్‌రూఫ్ ఉన్న కారు దూసుకుపోతోంది. ఇందులో అవాక్కడానికి ఏముందీ... అనేగా మీ సందేహం. కారు దూసుకుపోవడంలో వింతేమీ లేకున్నా కూడా.. కారు సన్‌రూఫ్‌ను (Car sunroof) వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఎవరైనా కారు సన్‌రూఫ్‌లో నిలబడి రైడ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు.
అయితే ఇతను మాత్ర ఈ సన్‌రూఫ్‌ను విచిత్రంగా వాడి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. కారు సన్‌రూఫ్‌లో చెరుకు గడలు పెట్టాడు. చెరుకు గడ మొదళ్లను కారు లోపలికి పెట్టి, చివర్లను కారు బయటికి పెట్టాడు. కారు సన్‌రూఫ్‌ను ఇలా విచిత్రంగా వాడిన ఇతన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. మరో వాహనంలో వెళ్తున్న వారు.. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘కారు సన్‌రూఫ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ కొందరు, ‘కారు సన్‌రూఫ్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడరేమో’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 2.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
లగేజీ చూసి.. అంతా లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..
రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి