Share News

Student Funny Video: స్కూల్‌కు వెళ్లనంటూ మారం చేసిన పిల్లాడు.. కుటుంబ సభ్యులు చేసిన పని చూస్తే...

ABN , Publish Date - Nov 01 , 2025 | 01:47 PM

బడికి వెళ్లే సమయంలో పిల్లలు మారాం చేయడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలను బలవంతంగా స్కూల్‌కు తీసుకెళ్తుంటారు. ఇంకొందరు బతిమాలో, బుజ్జగించో పంపిస్తుంటారు. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది..

Student Funny Video: స్కూల్‌కు వెళ్లనంటూ మారం చేసిన పిల్లాడు.. కుటుంబ సభ్యులు చేసిన పని చూస్తే...

పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఓ కామన్ సమస్య ఉంటుంది. పొద్దున్న లేవడంలో బద్దకించే పిల్లలు.. ఆ తర్వాత బడికి వెళ్లాలంటే మరింత మారం చేస్తుంటారు. వారిని బుజ్జగించి స్కూల్‌కు పంపడం తల్లిదండ్రులకు కొన్నిసార్లు పెద్ద తలనొప్పిలా మారుతుంటుంది. కొందరు తమ పిల్లలను బలవంతంగా ఎత్తుకెళ్లి బడిలో వేస్తే.. ఇంకొన్నిసార్లు మారాం చేసే పిల్లలను తోటి విద్యార్థులంతా తలో చేయి వేసి మోసుకెళ్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. మారాం చేసిన పిల్లాడిని స్కూల్‌కు ఎలా తీసుకెళ్లారో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బడికి వెళ్లే సమయంలో పిల్లలు మారాం చేయడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలను బలవంతంగా స్కూల్‌కు తీసుకెళ్తుంటారు. ఇంకొందరు బతిమాలో, బుజ్జగించో పంపిస్తుంటారు. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఓ పిల్లాడు బడికి వెళ్లనంటూ మారం చేశాడు. బలవంతం చేస్తుంటే.. వెళ్లి మంచం పట్టుకున్నాడు.


అంతటితో ఆగకుండా మంచం మధ్యలో తల కిందకు పెట్టి, దానికి వేలాడుతూ గట్టిగా పట్టుకున్నాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో కుటుంబ సభ్యులు చివరకు మంచంతో సహా ఎత్తుకెళ్లారు. ఇద్దరు యువకులు మంచాన్ని అటూ, ఇటూ పట్టుకుని ఎత్తుకెళ్లారు. స్కూల్ వరకూ అలానే మోసుకెళ్లారు. ఆ సమయంలో విద్యార్థి కూడా (Family members carrying child to school including bed) అలాగే మంచానికి వేలాడుతూ ఉన్నాడు. ఇలా మారాం చేసిన ఈ బుడ్డోడిని మంచంతో సహా ఎత్తుకెళ్లారన్నమాట. ఈ సీన్ చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు.


కొందరు ఈ ఘటనను వీడియో తసి, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈసారి మంచం కాకుండా.. గోడ పట్టుకుని కూర్చో’.. అంటూ కొందరు, ‘ఈ విద్యార్థి భవిష్యత్తులో నాయుడిగా మారి.. విద్యావంతులను పాలిస్తాడు’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..


ఇవి కూడా చదవండి..

లగేజీ చూసి.. అంతా లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..

రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 10 , 2025 | 10:08 AM