Home » Student
ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉండాలనే ఓ ఆలోచనతో ఇక్కడకు వచ్చానని వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేటు కాలేజ్ భవనంపై నుంచి పడి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థికి చికిత్స కొనసాగుతోంది.
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే ధృడ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అధునాతన సదుపాయాలు కల్పించి, పోషక ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.
పెంచుకుంటున్న ఆవు మృతి చెందడంతో.. తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలో చోటుచేసుకుంది. సెంథిల్‌కుమార్ అనే విద్యార్థి కుటుంబం ఆవును పెంచుకుంటోంది. అయితే... రెండురోజుల క్రితం అతి మృతిచెందడం.. అతడ్ని బాగా దాగాలుకు గురిచేసింది. అనంతరం అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విద్యా శాఖ ఓ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ఎలా అమలవుతుందన్న దానిపై ఓ ప్రత్యేక కథనం.
ఒక అపనింద పదో తరగతి చదువుతున్న బాలుడి ప్రాణం తీసింది. తమ బిడ్డ విగత జీవిగా ఉండటం చూసి.. ఆ బాలుడి తల్లిదండ్రులు భోరున విలపించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పామర్రులో చోటుచేసుకుంది.
పాఠశాలలకు సంబంధించిన సమాచారం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. సెలవులు ఇతర సమచారం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల్లో డిసెంబర్ నెలల వచ్చే సెలవులకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగార్థులకు మరో అద్భుతమైన అవకాశం రాబోతోంది. దీనికి ఏపీ రాజధాని అమరావతి డెస్టినీ కాబోతోంది. ఇప్పటికే ప్రకటించిన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకోసం ప్రత్యేక ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
సెల్‌ఫోన్.. మరో విద్యార్థిని ఊపిరితీసింది. ఫోన్ ఎక్కువగా చూడొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం సత్యనారాయణపేటలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.