December 2025 school holidays: విద్యార్థులకు సూపర్ న్యూస్.. వరుసగా సెలవులు!
ABN , Publish Date - Dec 03 , 2025 | 07:32 AM
పాఠశాలలకు సంబంధించిన సమాచారం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. సెలవులు ఇతర సమచారం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల్లో డిసెంబర్ నెలల వచ్చే సెలవులకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి నెలలో విద్యార్థులకు సెలవులు అనేవి ఉంటాయి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో హాలిడేస్ ఎక్కువగా వస్తుంటాయి. అలానే డిసెంబర్ నెలలో కూడా విద్యార్థులకు ఎక్కువ సెలవులు ఉండనున్నాయి. చలి, వర్షం, తుఫానుల ముప్పు కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. కొన్ని పాఠశాలలకు అయితే అధికారులు సెలవులను పొడిగించారు. వాతావరణ పరిస్థితులను బట్టి హాలిడేస్ షెడ్యూల్‌లు మారవచ్చు. ఆయ రాష్ట్రాల పరిస్థితులను బట్టి సెలవులు ఉంటాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
శీతాకాల సెలవులు:
ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్ లోయలో ఉప్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీని కారణంగా విద్యా శాఖ మూడు నెలల పాటు సెలవు ప్రకటించింది. ప్రీ-ప్రైమరీ పాఠశాలలు 2025 డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు మూసి వేయనున్నారు. అలానే1 నుండి 8 తరగతులు 2025 డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు సెలవులు ప్రకటించారు. అదే విధంగా 9 నుండి 12 తరగతులు 2025 డిసెంబర్ 11 నుంచి 2026 ఫిబ్రవరి 22 వరకు సెలవులు ఉన్నాయి.
తుఫాను కారణంగా సెలవు:
దిత్వా తుఫాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలోని కారైకల్, మహే, యానాం ప్రాంతాల్లో 2025 డిసెంబర్ 1న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్,ఎయిడెడ్ పాఠశాలలు మూసి ఉన్నాయి. అయితే తుపాన్ పరిస్థితులను బట్టి సెలవును పొడిగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్, బిహార్‌లో శీతాకాల సెలవులు:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు 2025 డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం 12 రోజుల వింటర్ హాలిడేస్ ఉంటాయి. ఈ కాలంలో విద్యార్థులు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను ఆస్వాదించవచ్చు. అలానే బీహార్‌లో వాతావరణం చాలా చల్లగా ఉంది. దీంతో గత సంవత్సరం మాదిరిగానే, శీతాకాల సెలవులు మొదట డిసెంబర్ 26 నుండి జనవరి 6 వరకు ఉండి... తరువాత తీవ్రమైన చలి కారణంగా 2026 జనవరి 11 వరకు పొడిగించబడ్డాయి. మంచు గాలులు మరియు ఉదయం పొగమంచు కారణంగా, చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్లడం ప్రమాదకరం. అందుకే విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని అధికారులు సెలవులు ప్రకటించారు. అలానే డిసెంబర్ 25న అన్ని పాఠశాలలకు సెలవు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పాఠశాలలు డిసెంబర్ 24న (క్రిస్మస్ ఈవ్) ఆప్షనల్ హాలిడే ఇవ్వాలని నిర్ణయించాయి.
ఇవి కూడా చదవండి..
తేదీలు ఫిక్స్.. 8న వందేమాతరం, 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ
సెల్‌ఫోన్స్‌లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి.. ఫోన్ తయారీదార్లకు కేంద్రం ఆదేశాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి