Share News

Parliament Session: తేదీలు ఫిక్స్.. 8న వందేమాతరం, 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ

ABN , Publish Date - Dec 02 , 2025 | 06:44 PM

అఖిలపక్ష సమావేశానంతరం మీడియాతో కాంగ్రెస్ విప్ కె.సురేష్ మాట్లాడుతూ, ఎస్ఆర్ఐ అంశంపై చర్చించాలని విపక్షాలు కోరాయని, ఎస్ఐఆర్‌ను కూడా జతచేసి ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు సమావేశం నిర్ణయించిందని తెలిపారు.

Parliament Session: తేదీలు ఫిక్స్.. 8న వందేమాతరం, 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ
Kiran Rijiju

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై చర్చకు కేంద్రం అంగీకరించింది. అయితే ప్రత్యేకంగా 'సర్'పై కాకుండా ఎన్నికల సంస్కరణలు (Election Reforms) అనే విస్తృత అంశాన్ని సభ ముందు ఉంచనుంది. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రం, విపక్షాల మధ్య అవగాహన కుదిరింది. ఆ ప్రకారం డిసెంబర్ 8న వందేమాతరం (Vande Mataram) పై, 9న ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో చర్చ జరుగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) తెలిపారు.


'లోక్‌సభ స్పీకర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందున దానిపై డిసెంబర్ 8 తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి చర్చ జరపాలని సమావేశం నిర్ణయించింది. అలాగే డిసెంబర్ 9 తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల సంస్కరణలపై చర్చ మొదలవుతుంది' అని కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.


10 గంటల పాటు డిబేట్

కాగా, అఖిలపక్ష సమావేశానంతరం మీడియాతో కాంగ్రెస్ విప్ కె.సురేష్ మాట్లాడుతూ, ఎస్ఆర్ఐ అంశంపై చర్చించాలని విపక్షాలు కోరాయని, ఎస్ఐఆర్‌ను కూడా జతచేసి ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు సమావేశం నిర్ణయించిందని తెలిపారు. సభలో 10 గంటల చొప్పున రెండు డిబేట్లకు సమయం కేటాయించారని, అవసరమైతే సమయం మరింత పొడిగించే అవకాశం ఉంటుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

పార్లమెంట్లో 'సంచార్ సాథీ' రగడ.. దేశ ప్రజల గోప్యతపై దాడి అంటూ విపక్షాల నిరసన

సెల్‌ఫోన్స్‌లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి.. ఫోన్ తయారీదార్లకు కేంద్రం ఆదేశాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 02 , 2025 | 06:45 PM