అత్యాచారం కేసులో బాధితురాలిగా చెబుతున్న మహిళ ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధంగా లేనప్పటికీ పోలీసులు బలవంతంగా ఆమె చేత ఫిర్యాదు చేయించారని ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. తాను విద్యాధికుడనని, తనపై తప్పుడు కేసు బనాయించారని, తాను ఎంపీగా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా అత్యాచారం ఫిర్యాదులు చేయలేదని అన్నారు.
అనిల్ అంబానీపై రూ. 3,000 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో ఈడీ తొలి అరెస్టు చేసింది. బిస్వాల్ ట్రేడ్లింక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి బిస్వాల్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనల కింద అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీ ఇంతకుముందు కూడా పార్లమెంటులో భూకంపం సృష్టిస్తామంటూ మాట్లారని, అవన్నీ అనవసరమైన మాటలేనని రాజ్‌నాథ్ అన్నారు. ఈసీఐ ఎలాంటి సందేహాలకు తావులేని సమగ్రతను కలిగి ఉందని కొనియాడారు.
లీగల్ కాంక్లేవ్ 2025లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసలు చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అరుణ్ జైట్లీ తనను బెదిరించినట్టు రాహుల్ తెలిపారు. ఆయన వాఖ్యలను రోహన్ జైట్లీ వెంటనే ఖండించారు.
ఈ మహిళలకు మాత్రమే పథకంతో నెలకు రూ. 7,000 సంపాదించే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. అర్హత ప్రమాణాలు, ఇంకా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం..
అసోంలోని కాచర్ జిల్లాకు చెందిన హుస్సేన్ అహ్మద్ మజుందార్ గురువారం ఇండిగో 6E-2387 విమానంలో ముంబై నుంచి కోల్‌కతా మీదుగా సిల్చార్కు ప్రయాణించాడు. అయితే విమాన ప్రయాణ సమయంలో ఓ వ్యక్తి హుస్సేన్ చెంపపై బలంగా కొట్టాడు.
పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్టు చూపిస్తూ 2,000కు పైగా వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వెలుగు చూడటం సంచలనమైంది. దీనిపై 2024లో ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబై ప్రత్యేక కోర్టు గత గురువారంనాడిచ్చిన తీర్పులో ప్రజ్ఞా ఠాగూర్, లెఫ్టినెంట్ కల్నర్ ప్రశాంత్ శ్రీకాంత్ పురోహిత్, మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.
వివాదాస్పద పోస్టర్లపై డీసీపీ (ట్రాఫిక్ వెస్ట్) నీతా దేశాయ్ వివరణ ఇస్తూ, ఇది రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రచారం అని, మహిళల భద్రతకు సంబంధించినది కాదని అన్నారు. ట్రాఫిక్ పోలీసుల అనుమతి లేకుండా సత్కృతా గ్రూప్ ఈ పోస్టర్లు వేసిందని చెప్పారు.
మానవ అక్రమ రవాణా, మత మార్పిడి ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన కేరళకు చెందిన ఇద్దరు క్రిస్టియన్ నన్స్‌కు స్థానిక బిలాస్పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 143, ఒరిస్సా మత స్వేచ్ఛా చట్టం..