Share News

Bride Ends Marriage: అత్తింటికి వచ్చి 20 నిమిషాలు.. వధువు ఇలా చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు..

ABN , Publish Date - Dec 02 , 2025 | 07:49 PM

అత్తింటికి వచ్చిన 20 నిమిషాల్లోనే పెళ్లి పెటాకులు చేసింది ఓ కొత్త పెళ్లి కూతురు. భర్త నుంచి విడిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

Bride Ends Marriage: అత్తింటికి వచ్చి 20 నిమిషాలు.. వధువు ఇలా చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు..
Bride Ends Marriage

లక్నో: పెళ్లి తర్వాత మొదటి సారి అత్తింటికి వెళ్లిన కొత్త పెళ్లి కూతురు ఊహించని షాక్ ఇచ్చింది. అత్తింటికి వచ్చిన 20 నిమిషాల్లోనే పెళ్లి పెటాకులు చేసింది. భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. డియోరియాకు చెందిన విశాల్ మాధేసియాకు అదే ప్రాంతానికి చెందిన పూజకు నవంబర్ 25వ తేదీన ఘనంగా పెళ్లి జరిగింది.


పెళ్లి జరిగిన రోజు రాత్రి కొత్త పెళ్లి కూతురు పూజ అత్తింటికి వచ్చింది. అత్తింటికి వచ్చిన 20 నిమిషాల పాటు బాగానే ఉంది. ఆ తర్వాత బంధువులందరి ముందుకు వచ్చి ‘మా అమ్మానాన్నను పిలవండి. నేను ఇక్కడ ఉండలేను’ అని అంది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె ప్రాంక్ చేస్తుందేమోనని అనుకున్నారు. ఆమె పదే పదే అదే మాట అనటంతో నమ్మక తప్పలేదు. వెంటనే ఆమె తల్లిదండ్రుల్ని పిలిపించారు.


అత్తింట్లో ఉండలేనని తల్లిదండ్రులతో పూజ తేల్చి చెప్పింది. వారు ఎంత బ్రతిమాలినా కూడా ఆమె వినలేదు. విడాకులు కావాలని పట్టుబట్టింది. కారణం అడిగినా ఏమీ చెప్పలేదు. ఈ వివాదంపై మరుసటి రోజు గ్రామ పంచాయతీ జరిగింది. రెండు కుటుంబాల అంగీకారంతో భార్యాభర్తలు విడిపోయారు. వధువు కుటుంబం ఇచ్చిన కానుకల్ని వరుడి కుటుంబం తిరిగి ఇచ్చేసింది. కొద్దిసేపటి తర్వాత పూజ కుటుంబం అక్కడినుంచి వెళ్లిపోయింది. ఇక, ఈ సంఘటనపై విశాల్ మాట్లాడుతూ.. ‘నేనంటే ఇష్టం లేదని పూజ నాతో ఎప్పుడూ చేప్పలేదు. పెళ్లి కాకముందు ఎంతో చక్కగా నాతో మాట్లాడింది. ఆమె చేసిన పని కారణంగా రెండు కుటుంబాలు అవమానాల పాలవుతున్నాయి’ అని అన్నాడు.


ఇవి కూడా చదవండి

సముద్రం అడుగున కెమెరా.. ఈ వింత చేపలను చూస్తే షాకవ్వాల్సిందే..

వచ్చే పదేళ్లలో అణు యుద్ధం తప్పదు.. ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..

Updated Date - Dec 02 , 2025 | 08:12 PM