Share News

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్యే

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:11 AM

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్యే
క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న బీవీ జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మిగనూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి మాక్‌ అసెంబ్లీకి ఎంపికైన తొమ్మిదో తరగతి విద్యార్థి నవనీత్‌ కుమార్‌, తల్లి శ్యామలా బాయి, పాఠశాల హెచ్‌ఎం గౌరమ్మ, శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు అబ్దుల్‌ రహిమాన్‌, దాదాబాషా, నాగవేణిని ఎమ్మెల్యే తన ఇంటి వద్ద ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విద్యారంగంలో పెనుమార్పులు తీసుకొస్తున్నారన్నారు. జూనియర్‌ కళాశాల ఏర్పాటు అంశం తీసుకురావటం విద్యార్థికి చదువుపై ఉన్న శ్రద్ధను తెలియజేస్తోందన్నారు. అసెంబ్లీలో ఎలా ఉండాలో చిన్నారులతో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పించారన్నారు. మాక్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన నవనీత్‌ కుమార్‌కు అన్ని రకాల సహయ సహకారాలు అందిస్తానన్నారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16నెలల్లోనే అభివృద్ది, సంక్షేమంతో ముందుకు వెళ్తున్నామన్నారు. టీడీపీ నాయకులు మాచాని మహేశ్‌, మిన్నప్ప, మహేంద్ర బాబు, చిన్నరాముడు, తిమ్మారెడ్డి, తిరుపతయ్య నాయుడు, రామాంజనేయులు, కాశీం వలి, ధర్మపురం గోపాల్‌, అంజి, జగదీష్‌, గౌస్‌పీరా, నరసింహులు, రాఘవేంద్ర, శేఖర్‌ పాల్గొన్నారు.

క్రికెట్‌ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బీవీ

ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా దివంగత మాజీ మంత్రి బీవీ మోహన్‌ రెడ్డి స్మారక అంతర్రాష్ట్ర క్రికెట్‌ టోర్నమెంట్‌ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. ముందుగా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎన్టీఆర్‌, బీవీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మైదానంలో క్రీడాకారును పరిచయం చేసుకొని బ్యాటింగ్‌ చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత తొమ్మిదిఏళ్లుగా బీవీ స్మారక క్రికెట్‌ను క్రీడాకారులకోసం నిర్వహిస్తున్నామ న్నారు. దాదాపు 130 జట్లు రావటం సంతోషకరమన్నారు. టీడీపీ నాయకులు బాస్కర్ల చంద్రశేఖర్‌, ఆర్గనైజర్లు మల్లా కలీముల్లా, భార్గవ్‌, రంగస్వామి గౌడ్‌, సురేశ్‌, మహేశ్‌, నవాజ్‌, భీమేష్‌, నరసప్ప, రామకృష్ణ నాయుడు, బీజేపీ నరసింహులు, పీఏసీఎస్‌ అధ్యక్షులు విరుపాక్షి రెడ్డి, గౌస్‌ పీరా, మార్కెట్‌ చైర్మన్‌ మల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:11 AM