Share News

Vehicle Viral Video: అంతా లగేజీ చూసి లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..

ABN , Publish Date - Nov 01 , 2025 | 08:02 AM

బైకుపై వెళ్తున్న వారికి ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. ఓ వాహనం భారీ ఎత్తున లోడుతో వెళ్తోంది. దీన్ని చూసి అదేదో పెద్ద లారీ ఏమో అనుకున్నారు. వీడియో తీసుకుంటూ వాహనం ముందు వైపు వెళ్లారు. అయితే చివరకు వాహనం ముందు వైపు వెళ్లగా.. షాకింగ్ సీన్ కనిపించింది..

Vehicle Viral Video: అంతా లగేజీ చూసి లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..

విచిత్ర వాహనాలను చూస్తుంటాం. వాటిని చిత్రవిచిత్రంగా వాడే వారిని కూడా చూస్తుంటాం. కొన్నిసార్లు కొందరు వాహనాలను వాడే విధానం చూసి అంతా అవాక్కవుతుంటారు. ఇలాంటి వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. లగేజీ వాహనాన్ని చూసి అంతా పెద్ద లారీ ఏమో అనుకున్నారు. అయితే చివరకు ముందు వైపు చూసి ఖంగుతిన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బైకుపై వెళ్తున్న వారికి ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. ఓ వాహనం భారీ ఎత్తున లోడుతో వెళ్తోంది. దీన్ని చూసి అదేదో పెద్ద లారీ (Container lorry) ఏమో అనుకున్నారు. వీడియో తీసుకుంటూ వాహనం ముందు వైపు వెళ్లారు. అయితే చివరకు వాహనం ముందు వైపు వెళ్లగా.. షాకింగ్ సీన్ కనిపించింది.


పెద్ద కంటైనర్ లారీ అనుకుంటే.. చివరకు అది చిన్న లగేజీ ఆటో (Luggage auto) అని తెలిసింది. లారీ అనుకుంటే చివరకు అది లగేజీ ఆటో అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అంత చిన్న ఆటోలో అంత పెద్ద స్థాయిలో లగేజీ తీసుకెళ్లడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఈ ఆటో డ్రైవర్ టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘వెనుక చూసి అదేదో పెద్ద కంటైనర్ లారీ ఏమో అనుకున్నాం’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 వేలకు పైగా లైక్‌లు, 2.67 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

బురద మీద పడిందని బుద్ధి చెప్పింది.. ఈ మహిళ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..

పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2025 | 08:02 AM