Share News

Woman Viral Video: రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..

ABN , Publish Date - Nov 01 , 2025 | 10:23 AM

ఓ యువతి రోడ్డు పక్కన వెళ్తుండగా.. పక్కనే చెట్ల పొదల్లో ఓ యువతి పడిపోయి కనిపించింది. ఆమెను చూడగానే షాక్ అయిన ఆ యువతి.. దగ్గరికి వెళ్లి పైకి లేపడానికి ప్రయత్నించింది. చేయి పట్టుకుని పైకి లేపి, పక్కకు తీసుకెళ్లాలని ప్రయత్నించింది. అయితే..

Woman Viral Video: రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..

బహిరంగ ప్రదేశాల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించే మహిళలను తరచూ చూస్తుంటాం. కొందరు అందరి మధ్య స్టంట్స్ చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ప్రాంక్‌లు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ప్రవర్తిస్తూ చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి రోడ్డు పక్కన పొదల్లో పడిపోవడం చూసి మరో యువతి ఆమెను పైకి లేపడానికి ప్రయత్నించింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి రోడ్డు పక్కన వెళ్తుండగా.. పక్కనే చెట్ల పొదల్లో (Young Woman Fell on the side of the road)ఓ యువతి పడిపోయి కనిపించింది. ఆమెను చూడగానే షాక్ అయిన ఆ యువతి.. దగ్గరికి వెళ్లి పైకి లేపడానికి ప్రయత్నించింది. చేయి పట్టుకుని పైకి లేపి, పక్కకు తీసుకెళ్లాలని ప్రయత్నించింది. అయితే ఆమెను ఇలా పైకి లేపగానే.. వెంటనే తూలి మళ్లీ ధబేల్‌మని పడిపోయింది.


చూస్తుంటే ఆ మహిళ ఫుల్‌గా మందు కొట్టి (Drunken Woman) పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు. వారంతా స్నేహితుల్లా కనిపిస్తున్నారని, అంతా కలిసి మందు కొట్టినట్లు తెలుస్తోందంటూ స్థానికులు చర్చించుకున్నారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘మందు తాగే అలవాటు ఉంటే.. ఇంట్లో తాగాలి గానీ.. ఇలా బహిరంగ ప్రదేశాల్లో తాగి పడిపోవడం ఏంటీ’.. అంటూ కొందరు, ‘ఆమె ప్రశాంతతకు భంగం కలిగిస్తు్న్నారు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 35 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

బురద మీద పడిందని బుద్ధి చెప్పింది.. ఈ మహిళ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..

పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2025 | 10:23 AM