Lorry Driver Funny Fideos: రోడ్డు పక్కన పడిపోయిన లారీ.. డ్రైవర్ నిర్వాకం చూసి అంతా షాక్..
ABN , Publish Date - Nov 07 , 2025 | 08:44 AM
ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. ఇందులో అంతా అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. ప్రమాదం నుంచి అతను బయటపడడంతో వింతేమీ లేకున్నా..
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడుతుంటారు. తాజాగా, ఓ లారీ ప్రమాదంలో డ్రైవర్ కూడా ఇలాగే ప్రాణాలతో బయపట్డాడు. అయితే అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా అతను ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో ( Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు (Lorry falls on the side of the road) బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. ఇందులో అంతా అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. ప్రమాదం నుంచి అతను బయటపడడంతో వింతేమీ లేకున్నా.. ఆ తర్వాత అతను చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు.
కిందపడిన లారీకి కొద్ది దూరంలో ఆ వ్యక్తి (Lorry driver lying on the side of the road) తాపీగా పడుకుని ఉన్నాడు. అది కూడా అక్కడ ఏమీ జరగనట్లు.. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ పడుకున్నట్లుగా వ్యవహరించాడు. రోడ్డు పక్కన వెళ్తున్న వారు ఈ ఘటనను మొత్తం తమ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
లగేజీ చూసి.. అంతా లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..
రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి