Share News

Watch Viral Video: హోటల్లో పోలీసుల తనిఖీలు.. యువతీయువకులు ఎలా బయటపడ్డారో చూస్తే..

ABN , Publish Date - Nov 07 , 2025 | 07:23 AM

ఓ హోటల్లో పోలీసులు అనుకోకుండా తనిఖీలు చేపట్టారు. దీంతో అందులో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక యువతీయువకుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోలీసులకు దొరికితే ఎక్కడ తమ పరువు పోతుందనే భయంతో ఏదోలా పారిపోదామని ట్రై చేశారు..

Watch Viral Video: హోటల్లో పోలీసుల తనిఖీలు.. యువతీయువకులు ఎలా బయటపడ్డారో చూస్తే..

కంటికి ఏ చిన్న వినూత్న సంఘటన కనిపించినా.. ఆ వెంటనే అది వీడియో రూపంలో సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటుంది. వాటిలో కొన్ని అంతా అవాక్కయ్యేలా ఉంటే.. మరికొన్ని అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొన్ని అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ హోటల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ విషయం తెలియగానే.. కొందరు యువతీయువకులు హోటల్ నుంచి తెలివిగా బయటపడ్డారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఉన్న సమాచారం బట్టి.. ఈ ఘటన బీహార్‌లో (Bihar) జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ హోటల్లో పోలీసులు అనుకోకుండా (Police checks in hotel rooms) తనిఖీలు చేపట్టారు. దీంతో అందులో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక యువతీయువకుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోలీసులకు దొరికితే ఎక్కడ తమ పరువు పోతుందనే భయంతో ఏదోలా పారిపోదామని ట్రై చేశారు.


ఈ క్రమంలో కొందరు యువతీయువకులకు విచిత్రమైన ఐడియా వచ్చింది. వెంటనే పరుగుత్తుకుంటూ హోటలో గది వెనుక వైపు వెళ్లారు. పై అంతస్తు నుంచి కిందకు పెద్ద పెద్ద కర్రలు నిలబెట్టి ఉన్నారు. వాటిని చూడగానే వారికి ఐడియా వచ్చింది. ఆ వెంటనే వారంతా ఆ కర్రల సాయంతో జారుకుంటూ చకచకా కిందకు వచ్చేశారు. ఇలా యువతీయువకులంతా కర్రలను పట్టుకుని నిముషాల వ్యవధిలో కిందకు వెళ్లిపోయారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇది యూపీలో జరిగినట్లు ఉంది.. బీహార్‌లో జరిగింది కాదు’.. అంటూ కొందరు, ‘వీళ్ల ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1900కి పైగా లైక్‌లు, 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

లగేజీ చూసి.. అంతా లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..

రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 07 , 2025 | 07:23 AM